Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రాలో ఏం జరుగుతుందో తెలియడం లేదు : విష్ణువర్ధన్ రెడ్డి

Advertiesment
ఆంధ్రాలో ఏం జరుగుతుందో తెలియడం లేదు : విష్ణువర్ధన్ రెడ్డి
, శనివారం, 21 డిశెంబరు 2019 (11:18 IST)
రాష్ట్రంలో ఎం జరుగుంతుందో అర్థంకాని పరిస్థితి నెలకొందని ఏపీ భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ, జియన్ రావు కమిటీ అనే దానికంటే జగన్మోహన్ రెడ్డి కమిటీ అంటే బాగుంటుంది. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కమిటీ నివేదికలు ఉన్నాయి. తెదేపాను గందరగోళంలో నెట్టడానికి జగన్ ప్రకటన ఉంది తప్ప ప్రజలకు ఉపయోగపడేలా లేదు. 
 
అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలా లేక అధికార వికేంద్రీకరణ జరగాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. హైకోర్టును కర్నూలులో పెట్టమంటే నాడు చంద్రబాబు వినలేదు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తమ జాగీర్ అనుకుంటున్నారు. రాష్ట్రాన్ని ఫుట్‌బాల్‌లా అడ్డుకుంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని భాజపానాడే చెప్పింది, దానికి కట్టుబడి ఉన్నాము. 
 
హైకోర్టు రావడం వలన కొత్తగా ఏమి వస్తుంది కర్నూలుకి మహా అయితే నాలుగు జిరాక్స్ మిషన్లు నాలుగు న్యాయవాదుల భవనాలు తప్పదు. జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయాలు తీసుకోవడానికి కారణం చంద్రబాబు నాయుడు. మిగిలిన రాష్ట్రాన్ని ముంచేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. నాలుగు వేల ఎకరాలు భు కుంభకోణం జరిగింది అని వైకాపా చెప్తుంది, కుంభకోణం జరిగి ఉంటే ఎందుకు నిరూపించలేకపోతున్నారు. రైతులు ఇష్టమో కష్టమో తమ పొలాలు త్యాగం చేసి రాజధానికి ఇచ్చారు. 
 
కృష్ణా గుంటూరు జిల్లాల్లో అధిక ఎమ్మెల్యేలు మీరే గెలిచారు, మీకు పట్టం కడితే అమరావతి రైతులను మోసం చేస్తారా? రాయలసీమలో పంటలు పండక ఏడుస్తుంటే, అమరావతి రైతులను మరోలా ఎడిపిస్తున్నారు. ముఖ్యమంత్రి అభివృద్ధి వికేంద్రీకరిస్తారా, లేక పరిపాలన వికేంద్రీకరిస్తారా?. 
 
రాజాకీయంగా తెదేపాను ఇబ్బంది పెట్టడానికే పరిపాలన వికేంద్రీకరణ అనే వైకాపా ఎత్తుగడల కనిపిస్తుంది. పరిపాలన వికేంద్రీకరణ చేసినంత మాత్రాన ప్రాంతాలు అభివృద్ధి చెందవు. హైకోర్టు ఒక ప్రాంతంలో బెంచ్ ఒక ప్రాంతంలో ఉండాలని ఎవరైనా చెప్తారు. దానికి జీయన్ రావు కమిటీ అవసరంలేదు. ఏ రాజకీయ పార్టీ అభిప్రాయాన్నైనా జియన్ రావు కమిటీ పరిగణలోకి తీసుకోలేదు. 
 
జియన్ రావు కమిటీ చెత్త బుట్టలో వేయడానికి తప్ప ఎందుకు పనిరాదు. ముఖ్యమంత్రి కార్యాలయం విశాఖలో, మంత్రులు అమరావతిలో, విమానాల్లో తరలిస్తారావారిని? పారిశ్రామికంగా అభివృద్ధి చేయండి అంతేకాని పరిపాలన వికేంద్రీకరణ చేయడం వలన అభివృద్ధి జరగదు. అమరావతిలో సీడెడ్ కాపిటల్ ఉండాలి, మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలి. అమరవతిలోనే సచివాలయం, అసెంబ్లీ ఉండాలి అది భాజపా స్పష్టమైన విధానమని ఆయన చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ పని చేయాలంటూ.. నా భార్యకు 3వేల ఫోన్ కాల్స్..