Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నవ్యాంధ్రలో 25 జిల్లాలు .. జగన్ యోచన : విజయసాయి వెల్లడి

నవ్యాంధ్రలో 25 జిల్లాలు .. జగన్ యోచన : విజయసాయి వెల్లడి
, శనివారం, 21 డిశెంబరు 2019 (15:59 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్‌ ఉన్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. విశాఖలోని వైకాపా ప్రధాన కార్యాలయంలో జగన్‌ జన్మదిన వేడుకలను నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. అన్ని జిల్లాలు అభివృద్ధి కావాలనే ఉద్దేశంతోనే 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చామని చెప్పారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలనుకోవడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. 
 
దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఏపీలో 3 రాజధానులు వస్తున్నాయని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. తెదేపా హయాంలో ఐదేళ్లలో జరగని అభివృద్ధిని 5 నెలల్లో జగన్‌ చేసి చూపించారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైకాపా జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం : హైకోర్టు