Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అయ్యో పాపం ఐఎఎస్‌ అధికారులు..!!

అయ్యో పాపం ఐఎఎస్‌ అధికారులు..!!
, గురువారం, 26 డిశెంబరు 2019 (11:06 IST)
అమరావతి రాజధాని పరిసర ప్రాంతాలలో ఐఎఎస్‌ అధికారులకు 500 గజాల స్థలాన్ని ప్రభుత్వం కేవలం రూ.25 లక్షలకే ఇచ్చిన విషయం విధితమే. ప్రస్తుత ఐఎఎస్‌ అధికారులతో పాటు ఒకటి రెండు సంవత్సరాలు ముందు రిటైర్డు అయిన ఐఎఎస్‌ అధికారులకు కూడా ప్రభుత్వం స్థలం ఇవ్వటం జరిగింది.
 
ఈ అధికారులలో చాలా మంది బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకుని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. కానీ ఇంత వరకు ఎవరెవరికి ఎక్కడెక్కడ స్థలం ఇచ్చారో చూపించలేదు. అంటే ఇంకా వారి ప్లాట్లను అభివృద్ది చేయలేదు అసెంబ్లీ ఆఖరి రోజు ముఖ్యమంత్రి జగన్‌ చేసిన ప్రకటనతో 500గజాల స్థలాలను కొనుగోలు చేసిన ఐఎఎస్‌ అధికారులు ఖంగుతిన్నారు. డీలా పడ్డారు. పరిపాలనకు సంబంధించిన రాజధాని ఇక్కడ లేనప్పుడు 500 గజాలలో ఇళ్లు ఎలా ఎట్టుకోవాలి. ఉద్యోగాలు చేసేది విశాఖపట్నంలో.. అమరావతిలో ఇల్లు కట్టుకుని ఏం చేయాలి.
 
ఈ విషయంపై ఐఎఎస్‌ అధికారుల సంఘం త్వరలో సమావేశం కావచ్చు. మేము 25 లక్షల రూపాయలు చెల్లించాం. మాకు ఆ స్థలాలు అక్కర్లేదు. వడ్డీతో కానీ లేక వడ్డీ లేకుండా కానీ మా రూ.25 లక్షలు తిరిగి చెల్లించండి అని కోరే అవకాశం ఉండవచ్చు. ఆ విధంగా ఐఎఎస్‌ అధికారులు కోరితే జగన్‌ కూడా అంగీకరించవచ్చు.

రాజధాని అమరావతి ప్రాంతంలో 500గజాలు 25లక్షలకు వచ్చింది… అక్కడే ఇల్లు నిర్మించుకుని స్థిర పడవచ్చు అని ఆశపడ్డ అనేక మంది ఐఎఎస్‌ అధికారులకు శాసనసభలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన వారిని నిరాశపరిచిందని చెప్పవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇస్రో శాస్త్రవేత్తకు కేబినెట్ హోదా