Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇస్రో శాస్త్రవేత్తకు కేబినెట్ హోదా

ఇస్రో శాస్త్రవేత్తకు కేబినెట్ హోదా
, గురువారం, 26 డిశెంబరు 2019 (11:01 IST)
ఇస్రో సీనియర్‌ శాస్త్రవేత్తలకు పదోన్నతిగా ఇచ్చే కేబినెట్‌ కార్యదర్శి పదవి త్రివేండ్రంలోని వీఎస్‌ఎస్‌సీ డైరెక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌కు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కేంద్ర కేబినెట్‌ కమిటీ సోమనాథ్‌ను కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ ర్యాంక్‌కు ఎంపిక చేసింది. ఈ నియామకంతో సోమనాథ్‌ 16వ పేమాట్రిక్స్‌ స్థాయి నుంచి 17వ స్థాయికి అప్‌గ్రేడ్‌ అయ్యారు. 2020 జనవరి 1 నుంచి సోమనాథ్‌కు ఈ పదోన్నతి అమలులోకి రానుంది. 
 
ప్రస్తుత ఇస్రో ఛైర్మన్‌ కే.శివన్‌ గతంలో ఇదేస్థాయిలో ఉండి 2018 జనవరిలో ఇస్రో ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 2021 జనవరిలో శివన్‌ పదవీకాలం పూర్తికానుడడంతో తదుపరి ఇస్రో ఛైర్మన్‌ అయ్యే అవకాశం సోమనాథ్‌కు కలగనుంది. బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌ఈ) పూర్వ విద్యార్థి అయిన సోమనాథ్‌ 1985లో ఇస్రోలో చేరారు. 
 
పీఎస్‌ఎల్వీ, జీఎస్‌ఎల్వీ, రాకెట్ల అభివృద్ధిలో విశేష పరిశోధనలు చేశారు. 2015లో ఇస్రో ఎల్‌పీఎస్‌సీ డైరెక్టర్‌గా సోమనాథ్‌ ఎంపికయ్యారు. 2018లో వీఎస్‌ఎస్‌సీ డైరెక్టర్‌గా ఉన్న శివన్‌ ఇస్రో ఛైర్మన్‌గా నియమితులు కావడంతో సోమనాథ్‌ ఆయన స్థానంలో వీఎస్‌ఎస్‌సీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌కు టర్కీ షాక్ : మళ్లీ ఘాటెక్కనున్న ఉల్లి ధరలు