Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేమిచ్చే తీర్పులపై అసహనం ఉంటే సుప్రీంకోర్టుకెళ్లండి... హైకోర్టు సీరియస్

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2020 (15:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాంపై ఏపీ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమైన హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తామిచ్చే తీర్పులపై అసహనం ఉంటే సుప్రీంకోర్టు వెళ్లాలంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. 
 
ఏపీలో వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ పార్టీ నేతలు అధికార బలంతో హైకోర్టు ఇచ్చే తీర్పులను తూర్పారబడుతూ, విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో తీవ్రమైన విమర్శలు వచ్చాయి. 
 
అదేసమయంలో కోర్టు తీర్పులపై వైకాపా నేతల విమర్శలను ఆక్షేపణ చేస్తూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు... న్యాయ వ్యవస్థను ఉద్దేశించి ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికింది.
 
హైకోర్టు వెలువరించిన తీర్పులపై అసహనం ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని... బహిరంగంగా కోర్టు తీర్పులపై వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పింది. ఏపీలో నెలకొన్న పరిస్థితులు దేశంలో మరెక్కడా లేవని అసహనం వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments