Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మేము అధికారంలో ఉంటే 15 నిమిషాల్లో చైనాను తరిమేసేవాళ్లం: రాహుల్ గాంధీ

మేము అధికారంలో ఉంటే 15 నిమిషాల్లో చైనాను తరిమేసేవాళ్లం: రాహుల్ గాంధీ
, బుధవారం, 7 అక్టోబరు 2020 (19:58 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. మన దేశ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని ఆయన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. హర్యానాలో పర్యటిస్తున్న రాహుల్ ఈ సందర్భంగా ఓ సమావేశంలో మాట్లాడుతూ.. భారత్- చైనా మధ్య తూర్పు లడఖ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలను గురించి ఆయన ప్రస్తావించారు.
 
మన దేశ భూబాగాన్ని ఎవ్వరూ తీసుకోలేదని మన ప్రధాని చెబుతున్నారు. ఒక దేశ భూభాగాన్ని మరో దేశం ఆక్రమించుకుంది. అలా భూమిని కోల్పోయిన దేశం ప్రపంచంలో ఈ వేళ ఒక్కటే ఉందని, అయినప్పటికీ మన దేశ ప్రధాని తనను తాను దేశ భక్తుడిగా చెప్పుకుంటున్నారు.
 
మేము గనుక అధికారంలో ఉంటే చైనాను 15 నిమిషాల్లో తరిమికొట్టేవాళ్లమని రాహుల్ గాంధీ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్-జపాన్‌ల మధ్య కీలక ఒప్పందం.. 5జీ టెక్నాలజీపై డీల్..?