ఏపీలో గణేశ్ ఉత్సవాలకు అనుమతి మంజూరు చేసిన హైకోర్టు కొన్ని షరతులు విధించింది. పరిమితమైన సంఖ్యతో ఈ ఉత్సవాలు నిర్వహణకు అభ్యంతరాల్లేవని ప్రకటించింది. గణేశ్ మండపాల వద్ద కరోనా నిబంధనలకు లోబడి కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతి ఇచ్చింది. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్ధించిన హైకోర్టు.. నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
ఏపీలో బహిరంగ స్ లాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేయడంపై హైకోర్టు కూడా ఆంక్షలు విధించింది. అయితే ప్రైవేటు స్థలాల్లో మాత్రం ఉత్సవాలు పరిమిత భక్తులతో నిర్వహించుకోవచ్చని తెలిపింది. దీంతో ఇప్పటివరకూ పూర్తిగా కొనసాగుతున్న ఆంక్షలపై కొంత ఊరట దక్కినట్లయింది. అయితే కోవిడ్ ధర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తోంది. దీనిపై బీజేపీ, టీడీపీ సహా విపక్షాలు రచ్చ రచ్చ చేస్తున్నాయి.
సినిమా హాళ్లకు అనుమతిచ్చిన ప్రభుత్వం గణేశ్ మండపాలపై ఆంక్షలు విధించడంపై జనం మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు వారికి కాస్త ఊరటనిచ్చేలా ఉన్నాయి.