Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనంత‌లో అంతర్ జిల్లా ద్విచక్ర వాహనాల దొంగల‌ అరెస్ట్

అనంత‌లో అంతర్ జిల్లా ద్విచక్ర వాహనాల దొంగల‌ అరెస్ట్
విజయవాడ , బుధవారం, 8 సెప్టెంబరు 2021 (14:06 IST)
అనంతపురం త్రీటౌన్ పోలీసులు నలుగురు అంతర్ జిల్లా ద్విచక్ర వాహనాల దొంగలను అరెస్టు చేశారు. వీరి నుండీ రూ. 9.60 లక్షల విలువ చేసే 17 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశాల మేరకు అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి, త్రీటౌన్ సి.ఐ రెడ్డెప్ప వివరాలు వెల్లడించారు. వాహ‌న దొంగ‌త‌నాలు చేసే సాయినాథ్, షేక్ బాబా వలీ, రమావత్ విజయ నాయక్, కె మారుతి ల‌ను అరెస్ట్ చేశారు. వారి నుంచి 17 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
 
ప్రస్తుతం అరెస్టయిన నలుగురి నిందితుల్లో సాయినాథ్ ముఖ్యుడు. ఇతను డ్రైవరుగా పని చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. దీని వలన వచ్చే ఆదాయం చాలక గత మూడు నెలల నుండి ద్విచక్ర వాహనాల దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డాడు. ఇతనితో పాటు బాబా వలీ @ సంజులు మార్తాడు గ్రామానికి చెందిన వారు కావడం వల్ల చిన్నతనం నుంచి మంచి స్నేహితులు. వీరికి అంకె మారుతి, రమావత్ విజయ నాయక్ పరిచయమయ్యారు. ఈ నలుగురు కలిసి మద్యం సేవించడం, జూదం ఆడటం లాంటి చెడు అలవాట్లకు బానిసలయ్యారు. 

వీరి జల్సాలకు అవసరమైన డబ్బు కోసం ద్విచక్ర వాహనాలు దొంగలించేందుకు మొదలు పెట్టారు. గత మూడు నెలలుగా నకిలీ తాళాలు ఉపయోగించి పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను సులువుగా దొంగలించేవారు. ఈతరహా 17 ద్విచక్ర వాహనాలు దొంగలించారు.  ఈ నలుగుర్ని స్థానిక శాంతినగర్ లో V.రెడ్డెప్ప, SI-నాగమధు, SI-బలరామరావు,  SI-వెంకటేశ్వర్లు మరియు అనంతపురము రూరల్ PS, SI-మహానంది మరియు వారి సిబ్బంది బృందంగా ఏర్పడి అరెస్టు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు దక్కనిది మరొకరికి దక్కకూడదు.. ప్రియురాలిని 10 సార్లు కత్తితో పొడిచి..