Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి కోసం దొంగగా మారిన ప్రియురాలు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (10:04 IST)
యువకుడిని గాఢంగా ప్రేమించింది. తానే అన్నీ అనుకుంది. విద్యలో అతను చూపుతున్న ప్రతిభ చూసి ఆశ్చర్యపోయింది. అయితే పైలెట్ శిక్షణలో ఉన్న యువకుడికి డబ్బు అవసరమైంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో కుమిలిపోతున్న ప్రియుడిని చూసి జాలి పడింది. తన ఇంట్లో తానే దొంగగా మారిపోయింది. 
 
గుజరాత్ లోని భక్తినగర్‌లో నివాసముంటున్న ప్రియాంకా పర్సానా, హేత్ షా గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. హేత్ షా బెంగుళూరులో పైలెట్ శిక్షణ పొందుతున్నాడు. అయితే పైలెట్ శిక్షణలో ఫీజు కట్టేందుకు 20 లక్షల రూపాయలు అవసరమైంది. నెల రోజులుగా డబ్బులు కట్టకపోవడంతో పాటు ఆవేదనకు గురయ్యాడు హేత్ షా. 
 
ప్రియుడు పడుతున్న ఆవేదనకు జాలిపడింది ప్రియాంకా. తన ఇంట్లో ఉన్న 90 లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలను దొంగతనం చేసి హేత్ షాకు ఇచ్చింది. బీరువాను చిందర వందర వేసి దొంగతనం జరిగిందని కట్టు కథ అల్లింది. దీంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరిపి దొంగ తన కూతురేనని తేల్చారు. దీంతో తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments