Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్త ఉద్యోగ ఒత్తిడిలో, భార్య ప్రియుడి కౌగిలిలో.. ఎక్కడ?

Advertiesment
భర్త ఉద్యోగ ఒత్తిడిలో, భార్య ప్రియుడి కౌగిలిలో.. ఎక్కడ?
, శనివారం, 15 డిశెంబరు 2018 (17:37 IST)
సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఇది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్త తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని దారుణంగా చంపించింది ఓ భార్య. హైదరాబాడ్‌లో జరిగింది ఈ సంఘటన.
 
రాజేంద్రనగర్, బండ్లగూడ ఏరియాలో నివాసముంటున్న ముఖేష్‌, రాగిణిలు ఇద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వీరి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా. ఇద్దరూ హైదరాబాద్ లోని దిల్‌సుఖ్ నగర్‌లో ఉన్న ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. వీరిద్దరు ఒకరినొకరు ప్రేమించుకుని, పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకున్నారు. ఆరు నెలల పాటు వీరి జీవితం సాఫీగానే సాగింది. 
 
పెళ్ళి తరువాత రెండు నెలలకు రాగిణి ఉద్యోగం మానేసింది. దీంతో ఇంటి భారం మొత్తం ముఖేష్ పైన పడింది. పని ఒత్తిడితో బాగా అలిసిపోయేవాడు. ఉదయం నుంచి రాత్రి వరకు పని మీదే ధ్యాస. దీంతో ఆరోగ్యం కాస్తా దెబ్బతింది. రాగిణితో సఖ్యతగా ఉండేవాడు కాదు ముఖేష్. సంసార సుఖం ఇవ్వకపోవడంతో ఆవేదన చెందిన రాగిణి తన ఇంటి పక్కనే ఉన్న యువకుడితో పరిచయం పెట్టుకుంది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.
 
ఇలా చాటుగా సాగుతూ వచ్చిన రాగిణి అక్రమ సంబంధం భర్తకు తెలిసిపోయింది. అనారోగ్యంతో ఉన్న ముఖేష్ భార్యను ఏమీ చేయలేక సైలెంట్‌గా ఉండిపోయాడు. ఐతే భర్త తరచూ సెలవులు పెడుతూ ఇంట్లో వుంటున్నాడు. ఆ సమయంలో ప్రియుడిని కలిసేందుకు వీలు కుదరకపోవడంతో అతడిని చంపేయాలని నిర్ణయించుకుంది. తన ప్రియుడితో కలిసి చున్నీతో ఉరివేసి భర్తను చంపించింది. ఆ తరువాత రాత్రికి రాత్రే తన ఇంటికి సమీపంలోని గోడౌన్ వద్ద పడేసి ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్త పడింది. 
 
అయితే శవాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ముఖేష్‌ను ఎవరో హత్య చేశారని నిర్థారించుకుని లోతుగా విచారణ జరిపారు. దీంతో అసలు విషయం బయటపడింది. రాగిణి ద్వారా యువకుడు కార్తీక్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేము బట్టలు మార్చుకుంటూ వుంటే.. జవాన్లు తొంగి చూస్తున్నారని అంటారు..