Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మొగుడు వద్దు.. ప్రియుడే ముద్దు : భార్య కిరాతక చర్య

Advertiesment
మొగుడు వద్దు.. ప్రియుడే ముద్దు : భార్య కిరాతక చర్య
, ఆదివారం, 16 డిశెంబరు 2018 (17:25 IST)
అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్త కంటే... మధ్యలో వచ్చిన ప్రియుడే ముద్దని భావించిన ఓ భార్య అత్యంత కిరాతక చర్యకు పాల్పడింది. కట్టుకున్న భర్త నుదుటిపై గొడ్డలితో నరికి హత్య చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని తొర్రూరులో జరిగిన ఈ హత్య కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నెల్లికుదురు గ్రామానికి చెందిన జెల్లక వెంకన్నకు కేసముద్రంకు చెందిన సుభద్రతో 18 యేళ్ళ క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ దంపతులు కూలి పనులు చేయించుకుంటూ జీవినం సాగిస్తున్నారు. 
 
ఈ క్రమంలో అమనగల్ ప్రాంతానికి చెందిన లావుడ్యా రామ్ అలియాస్ శీను అనే వ్యక్తి వద్ద వెంకన్న కుటుంబ అవసరాల నిమిత్తం రూ.50 వేలు అప్పు తీసుకున్నాడు. దీంతో వెంకన్న ఇంటికి శీను వస్తూపోతుండేవాడు. 
 
ఈ క్రమంలో సుభద్రతో శీనుకు ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసిన వెంకన్న వారిద్దరినీ మందలించడమే కాకుండా పంచాయతీ పెద్దలతో కూడా చెప్పించాడు. అయినప్పటికీ వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.
 
ఈ క్రమంలో భర్తను వదిలించుకోవాలని ప్లాన్ వేసిన సుభద్ర... శీను, అతని స్నేహితుడు మంగిలాల్‌తో కలిసి ఈనెల 7వ తేదీన గొడ్డలితో నుదుటిపై మోది చంపేశారు. ఆ తర్వాత ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు ముగ్గురినీ హత్య చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక్క యేడాది ఫోన్ వాడకుంటే రూ.72 లక్షల బహుమతి... ఎక్కడ? ఏంటి?