Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు టెక్కీలతో పాటు 50 మంది మహిళలపై అత్యాచారం.. ఆపై...

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (09:33 IST)
ఆ ఉన్మాది నయానా.. భయానో... బెదిరించో.. బుట్టలో వేసుకునో, లొంగదీసుకునే ఏవిధంగా అయితేనేం... ఏకంగా ముగ్గురు టెక్కీలతోపాటు ఏకంగా 50 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేనా, అత్యాచారం చేసే సమయంలో వీడియో తీసేవాడు. ఆ తర్వాత ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానంటూ బెదిరిస్తూ కొన్ని నెలల పాటు తన పైశాచికానందం పొందుతూ వచ్చాడు. చివరకు పోలీసులకు చిక్క కటకటాలపాలయ్యాడు. 
 
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగర శివారు ప్రాంతమైన అంబత్తూరులో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, అరివళగన్ అనే మాజీ ఐటీ ఉద్యోగి మతిస్థిమితం కోల్పోయి ఉన్మాదిగా మారిపోయాడు. ఆ తర్వాత మహిళలను బెదిరించి అత్యాచారం చేస్తూ, ఆ దృశ్యాలను తన సెల్‌‌ఫోన్‌లో అరివళగన్‌ రికార్డు చేసేవాడు.
 
ఆ వీడియోలతో మహిళలను బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ వాళ్లపై లైంగిక అకృత్యాలకు పాల్పడుతూ వచ్చాడు. ఈ వ్యవహారంపై ఓ బాధిత గృహిణి, ముగ్గురు మహిళా ఉద్యోగినిలు మహిళా పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. 
 
దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం పోలీసులు.. ముమ్మర గాలింపు తర్వాత ఎట్టకేలకు ఆ కామాంధుడుని అరెస్టు చేశారు. అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా, అందులో 50 మందికి పైగా మహిళలపై అత్యాచారం చేసిన వీడియోలు ఉండటాన్ని చూసి పోలీసులే అవాక్కయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం