Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డాక్టర్‌తో హోమో.. సె... భార్యకు ఇన్సులిన్ ఎక్కించి హత్య..

Advertiesment
డాక్టర్‌తో హోమో.. సె... భార్యకు ఇన్సులిన్ ఎక్కించి హత్య..
, గురువారం, 6 డిశెంబరు 2018 (12:16 IST)
హోమోసెక్స్‌కు బానిస అయిన ఓ వ్యక్తి తాను ప్రేమించి పెళ్లాడిన భార్యను హతమార్చాడు. ఈ ఘటన ఇంగ్లండ్‌లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌కు చెందిన మిటేష్ పటేల్ అనే వ్యక్తి జెస్సీకా పటేల్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ మెడికల్ షాపును నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో మిటేష్ ఓ డాక్టర్‌తో హోమోసెక్స్‌ సంబంధాన్ని కలిగివున్నాడు. 
 
ఈ విషయంలో జెస్సికాకు తెలియరావడంతో.. మిటేష్‌ను నిలదీసింది. ఈ వ్యవహారంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో జెస్సికాను వదిలించుకోవాలనుకున్న మిటేష్.. ఆమె శరీరంలోకి అత్యధిక ఇన్సులిన్‌ను ఇంజక్షన్ ద్వారా పంపి హతమార్చాడు. 
 
ఆపై ఏమీ తెలియనట్లు నటించాడు. ఈ ఘటనపై జెస్సికా తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు మిటేష్ బాగోతాన్ని బయటపెట్టారు. డాక్టర్‌తో హోమో సెక్స్‌కు బానిసపై మిటేష్ భార్యను హతమార్చాడని పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని నాలుక్కోసి హుండీలో వేసిన తూ.గో వాసి