Webdunia - Bharat's app for daily news and videos

Install App

సానుభూతి కోసమే రేణుక బుట్టా సస్పెన్షన్ ప్రచారం: రోజా

కర్నూలు ఎంపీ బుట్టా రేణుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడటంపై ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా నోరు విప్పారు. బుట్టా రేణుక టీడీపీలో చేరుతున్నట్లు రేణుక చెప్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. వైసీపీ నుంచి ర

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2017 (11:00 IST)
కర్నూలు ఎంపీ బుట్టా రేణుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడటంపై ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా నోరు విప్పారు. బుట్టా రేణుక టీడీపీలో చేరుతున్నట్లు రేణుక చెప్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. వైసీపీ నుంచి రేణుకను ఎవరూ సస్పెండ్ చేయలేదని, సానుభూతి కోసం ఆమే అలా ప్రచారం చేసుకుంటున్నారని రోజా తెలిపారు. వైసీపీ నుంచి మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. 
 
అనంతరం ముఖ్యమంత్రితో కలిసి విలేకరులతో మాట్లాడిన ఆమె తాను ప్రభుత్వానికి మద్దతు మాత్రమే ఇస్తున్నట్టు చెప్పారు. ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించలేదు. అయితే ఆమె అనుచరులు మాత్రం టీడీపీలో చేరారు. చంద్రబాబు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
 
మరోవైపు ఏపీ కేబినెట్‌ నుంచి గంటా శ్రీనివాసరావు, నారాయణను తక్షణమే బర్తరఫ్ చేయాలని రోజా డిమాండ్ చేశారు. నారాయణ, చైతన్య కాలేజీలు విద్యార్థులను బలి తీసుకుంటున్నాయని ఆమె ఫైర్ అయ్యారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు వెంటనే ఏపీ ప్రభుత్వం రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments