Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాడెవడో కనిపిస్తే చెప్పుతో కొట్టాలని వుంది.. మేము ఆ పనిచేయలేమా?: రోజా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మళ్లీ సీన్లోకి వచ్చారు. ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన రోజా.. తాజాగా నెటిజన్‌‌పై రోజా ఫైర్ అయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రోజా గుండుకొట్టినట్టు ఉన్న ఫోటోను చూడగ

Advertiesment
వాడెవడో కనిపిస్తే చెప్పుతో కొట్టాలని వుంది.. మేము ఆ పనిచేయలేమా?: రోజా
, ఆదివారం, 15 అక్టోబరు 2017 (12:24 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మళ్లీ సీన్లోకి వచ్చారు. ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన రోజా.. తాజాగా నెటిజన్‌‌పై రోజా ఫైర్ అయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రోజా గుండుకొట్టినట్టు ఉన్న ఫోటోను చూడగానే మండిపడ్డారు. ఈ ఫోటోను చూడగానే ముక్కుపుటాలు అదురుతుండగా..వాడెవడో కనిపిస్తే చెప్పుతో కొట్టాలని ఉందన్నారు. ఈ ఫోటోలు కేవలం తనకు మాత్రమే పెట్టలేదని, ఇలాంటి ఫోటోలు చాలా మంది వైఎస్సార్సీపీ నేతల ఫోటోలకు పెట్టాడని మండిపడ్డారు.
 
తాము తలచుకుంటే టీడీపీ నేతల పెళ్లాలకు గుండ్లు కొట్టేలా మార్ఫింగ్ ఫోటోలు పెట్టలేమా? అని  రోజా ప్రశ్నించారు. వాడెవడో ఒక అబ్బాఅమ్మకి పుట్టి ఉంటే ఇలాంటి పని చేస్తాడా?...వాడిని ఏం చెయ్యాలి? అని ప్రశ్నించారు. టీడీపీని అభిమానించడం తప్పుకాదని చెప్పిన ఆమె, ఇలాంటి కుసంస్కారులు ఆ పార్టీలో చాలామంది ఉన్నారని ఫైర్ అయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇరాన్, ఉత్తర కొరియాలపై ఫైర్ అయిన డొనాల్డ్ ట్రంప్