Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 13 January 2025
webdunia

ఒక అమ్మకీ, అబ్బకీ పుట్టిన వాళ్లయితే అలా చేయరు... రోజా ఫైర్

ఎమ్మెల్యే రోజా సోషల్ మీడియాలో పిచ్చి రాతలు రాస్తున్నవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న సందర్భంలో విలేకరి రోజాతో... నంద్యాల ఉపఎన్నికల ఫలితాల తర్వాత మీకు గుండు కొట్టించినట్లు ఫోటోలు పోస్ట్ చేశారు... దీనిపై స్పంద

Advertiesment
ఒక అమ్మకీ, అబ్బకీ పుట్టిన వాళ్లయితే అలా చేయరు... రోజా ఫైర్
, శనివారం, 14 అక్టోబరు 2017 (19:14 IST)
ఎమ్మెల్యే రోజా సోషల్ మీడియాలో పిచ్చి రాతలు రాస్తున్నవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న సందర్భంలో విలేకరి రోజాతో... నంద్యాల ఉపఎన్నికల ఫలితాల తర్వాత మీకు గుండు కొట్టించినట్లు ఫోటోలు పోస్ట్ చేశారు... దీనిపై స్పందన ఏమిటని అడగ్గానే ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక అమ్మకీ, అబ్బకీ పుట్టిన వాళ్లయితే ఇలా చేసి వుండరు. 
 
భారతదేశ సంప్రదాయంలో గుండు ఎప్పుడు కొడతారో తెలుసా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివారిని చెప్పుతో కొట్టాలనుకున్నాను. సభ్యత సంస్కారం వుంది కనుక మౌనంగా వుండిపోయాం. అసలు నంద్యాల ఉప ఎన్నికల్లో నేను పోటీ చేశానా అని ప్రశ్నించారు. సవాళ్లు చేసింది వాళ్లే ఇలాంటి పనులు చేయించిందీ వాళ్లే. తెదేపాలో కొందరు ముఖ్యమైనవాళ్లే ఇలాంటి పని చేయించారన్న సమాచారం నావద్ద వుంది. తెదేపా నాయకుల భార్యలు, కుమార్తెల ఫోటోలను ఇలా పెడితే వాళ్ల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. 
 
అసలు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో విశృంకలత్వం తారాస్థాయికి చేరిపోయింది. సంబంధం లేని ఫోటోలను జతచేసి నగ్నంగా ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. మా పిల్లలు ఫోన్లలో ఆడుకుంటుంటారు. వారి కంటపడితే ఏంటి సంగతి.. ఇలా మార్ఫింగ్ ఫోటోలు, అసభ్య రాతలు రాసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని రోజా డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ చెబితే రాజీనామా చేయాలా... నేను చేయను... తిరుపతి ఎంపి