జగన్‌కు వ్యవసాయం అంటే అర్థం తెలుసా?: బుద్ధా వెంకన్న
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వ్యవసాయం అంటే అర్థం తెలుసా? అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశ్నించారు. జగన్‌పై తీవ్రస్థాయిలో బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. రైతుల పట్ల జగన్ మొ
Publish Date: Sun, 15 Oct 2017 (15:45 IST)
Updated Date: Sun, 15 Oct 2017 (16:02 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వ్యవసాయం అంటే అర్థం తెలుసా? అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశ్నించారు. జగన్‌పై తీవ్రస్థాయిలో బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. రైతుల పట్ల జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని దుమ్మెత్తిపోశారు. ఆదివారం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు.
జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 14500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని రైతుల బలవంతంగా లాక్కోలేదా? అని జగన్‌ను ప్రశ్నించారు. జగన్ భూదాహానికి 3 లక్షల మంది రైతులు రోడ్డునపడ్డారని విమర్శించారు.
మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని వివరిస్తూ, రైతుల కష్టాలను తెలియజెప్పుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు.
రైతుల కష్టం మీకు కనిపించటం లేదా? అంటూ ఆయన ప్రశ్నించారు. లక్ష ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ఇటువంటి ఇబ్బందికర సమయంలో రైతుల ఆవేదన, ప్రజల ఆక్రందనను పట్టించుకునే తీరిక ప్రభుత్వానికి లేదా? అని జగన్ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.