Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో ఎటువంటి సడలిపులు లేవు: కృష్ణా కలెక్టర్

Vijayawada
Webdunia
మంగళవారం, 5 మే 2020 (16:06 IST)
విజయవాడ నగరంలో లాక్ డౌన్ అమలులో ఎటువంటి మినహాయింపులు లేవని జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

లాక్ డౌన్ లో సడలింపులు ఉన్నాయని కొంతమంది  రోడ్ల పైకి వస్తున్నారని, అలా వస్తే తప్పని సరిగా క్వారంటైన్ సెంటర్‌కు వెళ్లాల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు. ఈ విషయంపై ఇప్పటికే పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.

కంటైన్మెంట్ జోన్సలో నిబంధనలు చాలా పటిష్టం గా అమలు చేస్తున్నామని,దీనిని మరింతగా కట్టడి చేస్తామన్నారు.నగరంలో లాక్ డౌన్ అమలులో ఎటువంటి సడలిపులు లేవని, దయచేసి ఎవరు బయటకు రావద్దని సూచించారు. బయటకు వచ్చి ఇబ్బందులకు గురికావద్దని హితవుపలికారు.

కొద్దీ రోజుల పాటు ఓపిక పాటిస్తే కరోనా పారత్రోలవచ్చాన్ని కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు.కంటైన్మెంట్ క్లస్టర్ లో ఉన్నవారంతా తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ లో నూరు శాతం రిజిస్ట్రేషన్ చేయుంచుకోవాల్సిందే నన్నారు. క్లస్టర్ల విభజనకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించిందని ఆ ప్రకటన లో కలెక్టర్  ఇంతియాజ్ తెలిపారు.

ఆ మేరకు జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వం  క్లస్టర్లను గుర్తించిందన్నారు. గడిచిన 5 రోజుల్లో కేసులు రికార్డయితే అది వెరీ యాక్టివ్‌ క్లస్టర్‌గాను, గడిచిన 6 నుంచి 14 రోజుల్లోపు కేసులు నమోదైనా( 5 రోజుల్లోగా కేసులు లేకపోతే) వాటిని  యాక్టివ్‌ క్లస్టర్‌ గాను  గడిచిన 15 నుంచి 28 రోజుల్లో కేసులు నమోదైనా ( 15 రోజుల్లోగా కేసులు నమోదు కాకపోతే ) వాటిని  డార్మంట్‌ క్లస్టర్‌ గాను, 28 రోజులుగా కేసులు నమోదు కాకపోతే గ్రీన్ జోన్‌గాను గుర్తిస్తా మన్నారు.

ఒక గ్రీన్ జోన్ నుంచి మరో గ్రీన్ జోన్ కి మాత్రమే అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్రీన్ నుంచి రెడ్ జోన్ కి , రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్ కి అనుమతులు ఇవ్వడం జరగదన్నారు.  కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌లో పాజిటివ్‌ కేసు ఉన్న ఇంటి నుంచి ప్రారంభమై 500 మీటర్ల నుంచి 1 కి.మీ వరకూ 3 కిలోమీటర్ల వరకూ బఫర్‌ జోన్‌  (కేసు ఉన్న ఇంటి నుంచి దూరంతో కలుపుకుని)  కేసుల సంఖ్య, కాంటాక్ట్స్, తీవ్రతను బట్టి జిల్లా అధికారులు పరిధిని నిర్ణయిస్తామన్నారు.

అర్బన్‌ ప్రాంతాల్లో రెసిడెన్షియల్‌ కాలనీలు, మున్సిపల్‌ వార్డులు వారీగా కంటైన్‌మెంట్‌ క్లస్టర్లు,  కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌కు సమీపంలో ఉన్న వార్డులు, కాలనీల్లో సర్వేలెన్స్‌ కొనసాగుతుందన్,  రూరల్‌ ప్రాంతాల్లో పంచాయతీల ప్రాతిపదికన కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌ కేసులు, కాంటాక్టులను బట్టి అధికారులు దీనిచుట్టూ పరిధిని పెంచే అవకాశం ఉంటుంది.

కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో బారికేడ్లతో రోడ్ల మూసివేతతో పాటు అన్నిరకాల కదలికలు నిషేధం. నిత్యావసరాలకు ఇంటికి ఒకరిని మాత్రమే అనుమతిస్తారన్నారు.. వీలైనంత వరకూ ఇంటివద్దకే నిత్యావసరాల పంపిణీ చేస్తామని, కంటైన్‌మెంట్‌ క్లస్టర్ల వద్దకే మొబైల్‌ వాహనాలతో నిత్యావసరాల పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. వ్యక్తుల కదలికలన్నీ రికార్డు చేస్తామని, ప్రతి కుటుంబం ఆరోగ్యపరిస్థితులపై సంపూర్ణంగా పర్యవేక్షిస్తారని తెలిపారు.

కేసులు వారి కాంటాక్టుల వివరాలను 12, 24 గంటలకోసారి అప్‌డేట్‌ చేస్తారని, వైరస్‌ సోకినవారికి ఉన్న లక్షణాలను బట్టి క్వారంటైన్‌కు తరలిస్తారన్నారు. హై రిస్క్‌ ఉన్నవారికి వ్యాధి సోకితే ప్రోటోకాల్‌. మంచి వైద్యం కోసం తరలిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments