Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిఎంజెకెవై విజ‌య‌వాడ అధ్య‌క్షుడిగా జ‌గ‌దీష్ కుమార్ పురోహిత్

Advertiesment
పిఎంజెకెవై విజ‌య‌వాడ అధ్య‌క్షుడిగా జ‌గ‌దీష్ కుమార్ పురోహిత్
, శనివారం, 2 మే 2020 (15:09 IST)
ప‌్ర‌ధాన మంత్రి జ‌న క‌ల్యాణ‌కారీ యోజ‌న (పిఎంజెకెవై) న‌గ‌ర అధ్య‌క్షుడిగా విజ‌య‌వాడ‌కు చెందిన ‌జగదీష్ కుమార్ పురోహిత్ నియ‌మితుల‌య్యారు.

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రూపొందించిన పిఎంజెకెవై ప్ర‌చార‌, ప్ర‌సార అభియాన్ యువ‌జ‌న విభాగానికి అధ్య‌క్షుడిగా నియ‌మించారు. ఈ మేర‌కు నియామ‌క ప‌త్రాన్ని రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. జ్నానేశ్వర్ జారీ చేశారు.

విజయవాడ నగర యువజన విభాగం అధ్యక్షుడిగా జగదీష్ కుమార్ పురోహిత్ ను నియ‌మిస్తున్న‌ట్లు, విజ‌య‌వాడ న‌గ‌రంలో కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు సంబంధించిన ప‌రిశీల‌న‌, ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను అప్ప‌గిస్తున్న‌ట్లు తెలిపారు.

దారిద్యానికి దిగువ‌న ఉన్న ప్ర‌జ‌లు, ముఖ్యంగా రైతులు, వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల‌కు చెందిన విద్యార్థులు, బాలిక‌లు, చిరు వ్యాపారుల సంక్షేమం కోనం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంద‌ని, వాటిని ఎప్ప‌టిక‌పుడు ల‌బ్ధిదారుల చెంత‌కు తీసుకెళ్ల‌డం త‌న క‌ర్త‌వ్య‌మ‌ని జగదీష్ కుమార్ పురోహిత్  తెలిపారు.

ముఖ్యంగా విజ‌యవాడ న‌గ‌రంలో పేద విద్యార్థులు, చిరు వ్యాపారుల‌కు కేంద్రం నుంచి స‌హాయం అందేలా తాను ప‌ని చేస్తాన‌న్నారు. కేంద్రం త‌న‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించేందుకు శాయ‌శ‌క్తులా కృషి చేస్తాన‌ని  జగదీష్ కుమార్ పురోహిత్  తెలిపారు.

కొత్త‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన జగదీష్ కుమార్ పురోహిత్ కు కేంద్ర అధ్య‌క్షుడు భార‌త్ క‌టియాన్, రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ‌చీక‌టి లావ‌ణ్య కుమార్, అధ్య‌క్షుడు జ్ణానేశ్వ‌ర్  అభినంద‌న‌లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన ముగ్గురు న్యాయమూర్తులు