Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

విజయవాడలో ఐదుగురు జర్నలిస్టులకు కరోనా లక్షణాలు!

Advertiesment
Corona
, శనివారం, 2 మే 2020 (16:01 IST)
విధి నిర్వహణలో అలుపెరగని పోరాటం చేస్తూ కోవిడ్ వార్తలను కవర్ చేస్తున్న ఐదుగురు మీడియా ప్రతినిధుల్లో కరోనా వ్యాధి లక్షణాలు వెలుగు చూసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది.

విజయవాడ నగరంలో ఐఎంఏ, ఏపీయూడబ్ల్యుజె సంయుక్తంగా ఇటీవల జర్నలిస్టులకు ఉచిత కరోనా స్క్రీనింగ్ క్యాంపును నిర్వహించాయి. ఈ క్యాంపునకు విజయవాడలో పనిచేస్తున్న జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై పరీక్షలు చేయించుకున్నారు.

సుశిక్షితులైన వైద్య సిబ్బంది వీరినుంచి నమూనాలను సేకరించారు. ఈ నమూనాలను ప్రభుత్వ ఆస్పత్రిలోని ల్యాబ్ కు పంపించడం జరిగింది. టెస్ట్ నివేదికల్లో ఇందులో ఐదుగురికి కరోనా లక్షణాలు కానవచ్చాయని ఐఎంఏ నగర కార్యదర్శి డాక్టర్ తుమ్మల కార్తీక్ చెబుతున్నారు.

అయితే కరోనా లక్షణాలు కనిపించిన వారికి  మరొక పూర్తిస్థాయి పరీక్ష నిర్వహిస్తే కానీ.. పాజిటివ్ కేసులుగా నిర్ధారించలేమని స్పష్టం చేశారు. అనుమానితుల్లో ప్రముఖ టీవీ ఛానళ్ళ ప్రతినిధులు వున్నారని డాక్టర్ కార్తీక్ వెల్లడించారు.

ఇప్పటికే వారికి సమాచారం అందించడం జరుగుతోందన్నారు. ఒకవేళ వారిలో  కరోనా పాజిటివ్ లుగా తేలితే వారిని ప్రత్యేక చికిత్స కు తరలించడం జరుగుతుందన్నారు.

మీడియా మిత్రులెవరూ ఈ విషయంపై భయపడాల్సిన అవసరం లేదని, విజయవాడ లో కోవిడ్ రోగులకోసం అద్భుతమైన చికిత్స లభిస్తోందని డాక్టర్ తుమ్మల కార్తీక్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్(కరోనా వైరస్) బాధితులకు శుభవార్త!.. తొలి మెడిసిన్ బయటికొచ్చిందోచ్!