Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా ఎఫెక్ట్: మెట్రోల్లో కాంటాక్ట్‌లెస్‌ స్మార్ట్‌ కార్డులు

Advertiesment
కరోనా ఎఫెక్ట్: మెట్రోల్లో కాంటాక్ట్‌లెస్‌ స్మార్ట్‌ కార్డులు
, శుక్రవారం, 1 మే 2020 (16:29 IST)
లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత మెట్రో రైళ్లలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మెట్రో రైళ్లలో ఇక నుంచి మాగ్నెటిక్‌ స్ట్రిప్‌ స్మార్ట్‌ కార్డులు, కాంటాక్ట్‌లెస్ టికెట్లను ప్రవేశపెట్టాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

టోకెన్లు తీసుకునేందుకు క్యూలో నిలబడితే వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, అందుకే టోకెన్ల పద్ధతిని రద్దు చేయాలని నిర్ణయించామని అధికారులు చెప్పారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా అన్ని స్టేషన్లలో చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటించేలా, ప్రతీ ఒక్కరికి స్క్రీనింగ్‌ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

ప్రయాణికులను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని, రద్దీని బట్టి సర్వీసులను నడిపేలా ప్లాన్‌ చేసుకోవాలని మెట్రో అథారిటీలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరు మాస్క్‌ కట్టుకుని, ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు.

యాప్‌ వల్ల కరోనా పేషంట్‌ దగ్గర్లో ఉన్నట్లు తెలుస్తుందని, దాని ద్వారా అప్రమత్తంగా ఉండొచ్చని అధికారులు చెప్పారు. కాగా.. ఎయిర్‌‌పోర్ట్‌ అధికారులు కూడా ఫ్లైట్స్‌ విషయంలో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రయాణికుల మధ్య సోషల్‌ డిస్టెంసింగ్‌ మెయింటైన్‌ చేసేందుకు మధ్య సిటును ఎవరికి కేటాయించకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అంతే కాకుండా మాస్క్‌, ఆరోగ్య సేతు యాప్‌ కంపల్సరీ చేశారు. ప్రయాణికులు నిర్దేశించిన టైం కంటే ముందే ఎయిర్‌‌పోర్ట్‌కు చేరుకునేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్‌ నిర్వహించేలా ప్రాణాళికలు రూపొందిస్తున్నామని అధికారి ఒకరు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అప్పుడు 'డొక్కల కరువు' .. ఇప్పుడు కరోనా