Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నెల్లూరు జిల్లా కరోనా రోగుల కోసం రోబో

Advertiesment
Robo
, మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (17:13 IST)
నెల్లూరు ఎంపీ ఆ దాల ప్రభాకర్ రెడ్డి  ఆదేశాల మేరకు కరానా రోగుల కోసం కోవిడ్- 19 రోబోను సయ్యద్ నిజాముద్దీన్, జిల్లా కలెక్టర్ శేషగిరి బాబుకు అందజేశారు.

నెల్లూరు న్యూ జెడ్పీ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సయ్యద్ నిజాముద్దీన్ విలేకరులతో మాట్లాడుతూ.. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కోరిక మేరకు ఈ రోబోను తన మేనల్లుడు సయ్యద్ పర్వేజ్తో తయారు చేయించానని చెప్పారు.

లక్షలాది రూపాయల విలువ చేసే ఈ రోబో అందించే సేవలు అమూల్యమైనవని తెలిపారు. దీన్ని ప్రపంచంలోని ఏ మూల నుంచైనా పని చేయించవచ్చునని తెలిపారు. కరోన వైరస్ రోగుల దగ్గరికి డాక్టర్లు వెళ్లకుండానే మందులు, ఇతర సామగ్రిని ఈ రోబో ద్వారా అందజేయ వచ్చునని  చెప్పారు.

తాను చెప్పదలుచుకున్న విషయాన్ని రోగి రోబో ముందు చెబితే డాక్టర్లు ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవచ్చునన్నారు. అలాగే వారు దూరం నుంచే రోబో ద్వారా రోగులకు సూచనలు సలహాలు దృశ్య మాధ్యమం ద్వారా అంద చేయవచ్చునని పేర్కొన్నారు.

ఈ ప్రయత్నాన్ని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అభినందించారని ఈ సందర్భంగా తెలిపారు. రోబో పని తీరును చూసిన జిల్లా కలెక్టర్ ఇటువంటివి మరో నాలుగు రోబోలు జిల్లాకు అవసరమవుతాయని, వాటిని రూపొందించి ఇవ్వమని కోరినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా రోబో పనితీరును నిజాముద్దీన్ ప్రదర్శించి చూపించారు. ఈ కార్యక్రమంలో కోవిడ్ పర్యవేక్షణ ప్రత్యేకాధికారి రామ్ గోపాల్  పాల్గొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ తన ప్రశంసలను తెలిపారు. రోబో రూపశిల్పి సయ్యద్ పర్వేజ్ కూడా పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్‌డౌన్ పొడగింపుపై భిన్నాభిప్రాయాలు... తెలంగాణాలో మాత్రం...