Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దటీజ్ మోదీ.. అర్థరాత్రి తెరచుకున్న భువనేశ్వర్ విమానాశ్రయం..విషయమేంటో తెలుసా?

దటీజ్ మోదీ.. అర్థరాత్రి తెరచుకున్న భువనేశ్వర్ విమానాశ్రయం..విషయమేంటో తెలుసా?
, శనివారం, 2 మే 2020 (15:47 IST)
"ఈ సమయంలో ఫోన్ చేస్తున్నందుకు క్షమించండి, మేము ఆర్డర్ చేసిన కరోనా కిట్‌లు ముంబై-నాసిక్ మార్గంలో చిక్కుకుపోయాయి. అవి ఇప్పుడల్లా మాకు చేరే అవకాశం లేదు, మాకు మీరే దిక్కు, అవి త్వరగా మాకు చేరేలా సాయం చేయండి.." అంటూ నిన్న అర్థరాత్రి 12.15 కు ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్ ప్రధానమంత్రి మోదీకి ఫోన్ చేశారు. 

మోదీ రిప్లై ఇస్తూ, మధ్యలో కొంచం గ్యాప్ తీసుకుని అదేం పట్టనట్లుగా వారి ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా అడిగి మరీ తెలుసుకున్నారు. నవీన్‌పట్నాయక్ ఒకింత అసహనంతో "మోదీజీ నేను బాగానే ఉన్నాను, ఈ సమయంలో మీకు ఫోన్ చేయడానికి కారణం మాకు కిట్లు అర్జంటుగా ముంబై నుంచి వచ్చేలా సాయం చేయమని.." అన్నారు.

అందుకు మోదీ "మీకు కిట్లు లోడ్ అవుతున్నాయి, నేను ఢిల్లీ నుంచి నేరుగా భువనేశ్వర్‌కి ప్రత్యేక విమానంలో పంపుతున్నాను, మీరు నిద్ర లేచేటప్పటికి మీ ముందు కిట్లు ఉంటాయి.." అని చెప్పారు. దీనికి నవీన్‌పట్నాయక్ ఏమీ అర్థం కాక ఉబ్బితబ్బిబ్బై పోయారు..కారణం ఆయన అడిగింది ముంబై-నాసిక్ రోడ్డు మార్గంలో చిక్కుకుపోయిన కిట్ల కోసమైతే మోదీ అడక్కుండానే నేరుగా ఢిల్లీ నుంచి పంపుతున్నందుకు. 
 
అదీకాక భువనేశ్వర్ ఎయిర్‌పోర్టు లాక్‌డౌన్ కారణంగా గత నెల రోజులుగా మూసివేసి ఉన్నారు. ఇదెలా సాధ్యం?.. నా తృప్తి కోసం మోదీ అలా చెప్పి ఉంటాడు, నా 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇలా ఎన్ని చూడలేదు.. అని అనుకున్నాడు. 
 
కానీ అప్పటికప్పుడు భువనేశ్వర్ విమానాశ్రయ కార్గో విభాగం తెరుచుకున్నది. విమానాశ్రయంలో ఎక్కడ లేని హడావుడి ప్రారంభమైంది. 
 
నెల రోజులుగా హాయిగా నిద్రపోతున్న అక్కడున్న స్టాఫ్ అర్థరాత్రి ఏమిటి ఈ హడావుడి అనుకున్నారు. నవీన్‌పట్నాయక్ మోదీకి ఫోన్ చేసింది 12.15 కి అయితే, కరోనా కిట్లతో కార్గో విమానం భువనేశ్వర్ ఎయిర్‌పోర్టులో 3.15 కి ల్యాండ్ అయినది. దటీజ్ మోదీ!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్‌డౌన్‌ సడలింపు వద్దు..సడలిస్తే తీవ్ర పరిణామాలు : డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక