Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలో ఆరుచోట్ల ఎయిర్​పోర్టుల నిర్మాణానికి అనుకూలం

Advertiesment
six places
, గురువారం, 12 మార్చి 2020 (06:06 IST)
తెలంగాణలో విమానాశ్రయాల నిర్మాణానికి ఆరు చోట్ల అనుకూలంగా ఉన్నట్లు ఎయిర్‌పోర్టు ఆథారిటీ ఆఫ్‌ ఇండియా నివేదిక ఇచ్చింది. సాంకేతికంగా పచ్చజెండా లభించిన ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాల విస్తరణ, నిర్మాణానికి అవకాశం ఉన్నట్లు నిపుణుల బృందం పేర్కొంది. రాష్ట్రంలో నూతన విమానాశ్రయాల నిర్మాణానికి మార్గం సుగమమౌతోంది.

ఇతర ప్రాంతాలతో తెలంగాణలోని పలు పట్టణాలు గగనతల అనుసంధానం పొందనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్‌ సమీపంలోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. ప్రభుత్వ వ్యూహం కార్యరూపంలోకి వస్తే రానున్న సంవత్సరాల్లో విమానాశ్రయాల సంఖ్య ఏడుకు చేరుకుంటుంది.

అనుసంధానం కోసం ఉడాన్.. చిన్న చిన్న ప్రాంతాలకు విమాన అనుసంధానత కల్పించేందుకు కేంద్రం ఉడాన్‌’ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద రాష్ట్రంలోని బసంత్‌నగర్‌ (పెద్దపల్లి), మామునూరు (వరంగల్‌), ఖానాపూర్‌ (ఆదిలాబాద్‌)లలో వినియోగంలోలేని ఎయిర్‌ఫీల్డ్‌లను విమానాశ్రయాలుగా మార్చే అవకాశం ఉంది.

వీటితో పాటు జక్రాన్‌పల్లి (నిజామాబాద్‌), కొత్తగూడెం/భద్రాచలం, గుడిబండ (మహబూబ్‌నగర్‌)లలో విమానాశ్రయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థలాలను గుర్తించింది. తొలుత చిన్న విమానాలు.. సాంకేతికంగా సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసే బాధ్యతను భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ (ఎయిర్‌పోర్టు ఆథారిటీ ఆఫ్‌ ఇండియా)కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.

క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన అధికారుల బృందం ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు నివేదికను ఇచ్చింది. సాంకేతికంగా పచ్చజెండా లభించిన ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాల విస్తరణ, నిర్మాణానికి అవకాశం ఉన్నట్లు నిపుణుల బృందం పేర్కొంది. చిన్న విమానాలైన ఏటీఆర్‌- 72, క్యూ- 400లతో తొలుత సర్వీసులను ప్రారంభించొచ్చని స్పష్టం చేసింది.

వరంగల్‌, మహబూబ్‌నగర్‌ విమానాశ్రయాలకు సాంకేతికంగా ఇబ్బంది లేకపోయినప్పటికీ ఆ రెండూ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి 150 కిలోమీటర్లలోపు ఉండటం ప్రతిబంధకంగా ఉంది. శంషాబాద్‌ విమానాశ్రయం ప్రారంభమైనప్పటి నుంచి 25 ఏళ్ల వరకు 150 ఏరియల్‌ కిలోమీటర్ల దూరంలో మరో విమానాశ్రయం నిర్మాణం లేదా విస్తరణ చేయకూడదన్నది అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం, నిర్మాణ సంస్థ మధ్య జరిగిన ఒప్పందంలోని నిబంధన.

ఆ నిబంధన చిక్కుముడిని ఎలా విప్పాలన్నది ఇప్పుడు తేల్చాల్సి ఉంది. అనుకూల ప్రాంతాలివే అనుకూల ప్రదేశం జిల్లా బసంత్‌నగర్‌ పెద్దపల్లి 2. మామునూరు వరంగల్‌ 3. ఖానాపూర్‌ ఆదిలాబాద్‌ 4. జక్రాన్‌పల్లి నిజామాబాద్‌ 5. కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం 6. గుడిబండ మహబూబ్‌నగర్‌

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్‌