Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ముగ్గురి హత్యకు వైసీపీ ప్రయత్నం: చంద్రబాబు

Webdunia
గురువారం, 12 మార్చి 2020 (06:23 IST)
తమ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, అధికార ప్రతినిధి బొండా ఉమామహేశ్వరరావు, న్యాయవాది కిశోర్‌లను హత్య చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.

మాచర్లలో పై ముగ్గురిపై వైసీపీ నేతల దాడి ఘటన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. పల్నాడులోనే కాదు, రాష్ట్రమంతా ఇలాగే జరుగుతోందన్నారు. కశ్మీర్‌, బిహారుల్లో కూడా ఇలాంటి దుర్మార్గాలు చూడలేదన్నారు. పరిస్థితులు ఇలా ఉంటే డీజీపీ ఏం చేస్తున్నారని నిలదీశారు.

"మాచర్లలో దాడి జరగకముందే గుంటూరు ఎస్పీతో మాట్లాడాను. మాచర్లలో చాలా దారుణంగా ఉంది. నామినేషన్లు లేవు.. మీరు చర్యలు తీసుకోవాలని చెప్పాను. కానీ ఆయనేం చర్యలు తీసుకోలేదు. ఆయనతో మాట్లాడిన రెండు గంటలకే దాడి జరిగింది. కనీసం అప్పుడైనా ఫోన్‌చేసి.. ఇలా జరిగినందుకు బాధపడుతున్నాను.. రక్షణ కల్పిస్తానని కూడా చెప్పలేదు. రెండు, మూడు సార్లు ఫోన్‌ చేస్తే తప్ప లైన్‌లోకి రాలేదు. మరోవైపు డీజీపీకి కూడా ఫిర్యాదు చేశాం.

కనీసం మర్యాదగానైనా ఈ సంఘటన పట్ల బాధపడుతున్నామని చెప్పలేదు. ఇదేనా దుండగులను శిక్షించే విధానం? ఇదేనా జనాన్ని రక్షించే పద్ధతి? ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి వెళ్లిన వాళ్లు చనిపోవాలా? ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని? రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తారా? అడ్డం వచ్చినవాళ్లపై దాడులు చేస్తారా?

పోలీసు వాహనాలపై దాడిచేసే ధైర్యం వచ్చిందంటే ఏం చేయాలి? నేను ప్రతి నిమిషం పిటిషన్లు పెట్టుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేయాలా? నామినేషన్లు వేయడానికి స్వేచ్ఛ లేదా? నా జీవితంలో ఈ తరహా ఎప్పుడూ చూడలేదు. ఇది చూశాకైనా ప్రజల్లో కనువిప్పు కలగాలి. రాజకీయ పార్టీలు ఆలోచించాలి. రాష్ట్రాన్ని కాపాడుకుంటారా? శాశ్వతంగా తాకట్టు పెట్టేస్తారా? ఈ సమస్యను ప్రజల కోర్టులో పెడుతున్నాం" అని చంద్రబాబు  పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments