Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైసీపీలోకి 'కరణం'?!

Advertiesment
వైసీపీలోకి 'కరణం'?!
, గురువారం, 12 మార్చి 2020 (05:53 IST)
చాలా కాలంగా అవకాశం కోసం ఎదురు చూస్తున్న టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం.. ఎట్టకేలకు తను అనుకున్న దిశగా అడుగులు వేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే జంపింగ్ కు సిద్ధమైన ఆయన.. ఇప్పుడు ఆచరణలో పెట్టబోతున్నట్లు తెలిసింది. కరణం బలరాం వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

గురువారం లేదా శుక్రవారం జగన్‌తో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. స్థానిక ఎన్నికల నామినేషన్లకు కరణం బలరాం దూరంగా ఉన్నారని సమాచారం. గత ఎన్నికల్లో ఆమంచికృష్ణమోహన్‌పై పోటీ చేసి కరణం బలరాం చీరాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. చీరాలకు బలరాం నాన్ లోకల్ అయినప్పటికీ కృష్ణమోహన్‌పై ఆయన 17, 801 ఓట్ల మెజార్టీతో గెలిపొందారు.

ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరిన కరణం బలరాం.. చంద్రబాబుకు చాలా సన్నిహితంగా ఉండేవారు. 4 సార్లు ఎమ్యెల్యేగా, ఒక సారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కరణం బలరాం పార్టీ వీడటంతో చీరాల టీడీపీకి భారీ షాక్ తగలనుంది. ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీత ఇప్పటికే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారీగా తగ్గిన బంగారం ధరలు