Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ పెద్ద పతివ్రతలా మాట్లాడుతున్నారు : చంద్రబాబు సెటైర్లు

Webdunia
శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (14:57 IST)
వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇపుడు పెద్ద పతివ్రతలా పాల్పడుతున్నారంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పైగా, రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసకర చర్యల వల్ల పోలవరం ప్రాజెక్టు ఆగిపోయిందంటూ మండిపడ్డారు. 
 
ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు ఆంధ్రుల కల అని... ఏ ఒక్కరినీ సంప్రదించకుండా ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపివేశారని ఆగ్రహించారు. ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టును ఆపేశారన్నారు. ఇంత భారీ ప్రాజెక్టులు దేశ చరిత్రలో ఎప్పుడూ రివర్స్ టెండరింగ్‌కు పోలేదని గుర్తుచేశారు. ఇది రివర్స్ టెండరింగ్ కాదని... రిజర్వ్ టెండరింగ్ అని ధ్వజమెత్తారు. 
 
పోలవరం విషయంలో ముఖ్యమంత్రి బంధువు పీటల్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకు వెళుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినా, నిపుణులు హెచ్చరించినా వినకుండా జగన్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్మించడం... మా ఇంటికి నోటీసులు అందించినంత ఈజీ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 
 
మరో ఏడాది కష్టపడి ఉంటే పోలవరం పూర్తయ్యేదని అన్నారు. పోలవరంపై మంత్రులు రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఒక పతివ్రతలా, నీతిమంతుడిలా మాట్లాడుతున్నారని... ఇప్పటివరకు పనిచేసిన ముఖ్యమంత్రులు, మంత్రులంతా తెలివిలేని వారా? అని మండిపడ్డారు. 
 
గోదావరిలో బోటు మునిగిపోతే కనిపెట్టలేనివారు... రివర్స్ టెండరింగ్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని మీడియా ఈ టెర్రరిస్టు ప్రభుత్వాన్ని చూసి భయపెడుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments