Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహా ఏమి రుచి! ఆత్రేయపురం పూత రేకులకు అరుదైన గౌరవం

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (10:15 IST)
ఆత్రేయ‌పురం పూత రేకులు తింటే... ఆహా ఏమి రుచి అన‌క‌మాన‌రు. నోట్లో వేసుకుంటే, ఇట్టే క‌రిగిపోయి, మ‌ధురానుభూతిని అందించే పూత‌రేకుల‌కు ఇపుడు అరుదైన గౌరవం ల‌భించింది. పూతరేకులకు చిహ్నంగా భారతీయ తపాలా శాఖ ప్రత్యేకంగా కవర్‌ను విడుదల చేసింది. ఆత్రేయపురం ప్రధాన తపాలా కార్యాలయంలో దీనిని విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రధాన తపాలా కార్యాలయాల్లో ఇక పూతరేకుల పోస్టల్‌ కవర్‌ అందుబాటులో ఉండనున్నాయి.
    
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం పూత రేకులకు ద‌క్కిన అరుదైన గుర్తింపు ఇది. అంతర్జాతీయ స్థాయిలో కీర్తి దక్కిన పూతరేకులకు చిహ్నంగా భారతీయ తపాలా శాఖ ప్రత్యేకంగా కవర్‌ను విడుదల చేసింది. ఆత్రేయపురం ప్రధాన తపాలా కార్యాలయంలో విశాఖ రీజియన్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ ఎం.వెంకటేశ్వర్లు ప్రత్యేక తపాలా కవరును విడుదల చేశారు. ఈ కవర్‌ను రూ.20లకు పొందవచ్చన్నారు. రాష్ట్రంలో ప్రధాన తపాలా కార్యాలయాల్లో పూతరేకుల పోస్టల్‌ కవర్‌ అందుబాటులో ఉండనున్నాయి.
 
300ఏళ్ల క్రితం ఆత్రేయపురంలో పూతరేకుల తయారీ కుటీర పరిశ్రమగా ఏర్పడింది. కోట్లాది రూపాయల టర్నోవర్‌ సాధిస్తూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏళ్ల చరిత్ర ఉన్న ఆత్రేయపురం పూతరేకుల తయారీపై దాదాపు 500 కుటుంబాలకు పైగా ఆధారపడి జీవిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తపాలాశాఖ కవర్ విడుదల చేసి మరోసారి గుర్తింపు ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments