సెక్ర‌టేరియేట్ నుంచి మాట్లాడుతున్నా.... అగంతుకుడి బ్లాక్ మెయిల్!

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (11:28 IST)
ఒక్కోసారి ప్ర‌భుత్వ అధికారులు మైండ్ అస‌లు ఉప‌యోగించ‌రు. ఈజీగా మోస‌గాళ్ళ‌ ట్రాప్ లో ప‌డిపోతారు. ఇలానే, టోక‌రా వేశాడో అగంత‌కుడు... దీనితో తెలంగాణా జిల్లా రంగారెడ్డి అధికారులు తెల్ల‌ముఖం వేశారు. త‌మ వ‌ద్ద అధికారికంగా లిస్ట్ తీసుకుని, తీరిక‌గా ఆ ఆగంత‌కుడు ఉద్యోగుల‌ను బ్లాక్ మెయిల్ చేశాడ‌ని గ్ర‌హించారు. 
 
సెక్రటేరియేట్ నుండి మాట్లాడుతున్నా అని రంగారెడ్డి కలెక్టరేట్ కు ఫోన్ కాల్స్ చేసాడో అగంతకుడు. జిల్లాలో సస్పెండ్ అయిన వి.అర్.వోలు, జూనియర్ అసిస్టెంట్ ల‌ వివరాలు ఇవ్వాలని ఫోన్ చేశాడు. లిస్ట్ ప‌ట్టుకుని తానే సచివాలయం వద్దకు తీసుకొస్తామని ఆ ఉన్నత అధికారి బ‌దులిచ్చాడు. వ‌ద్దు త‌న‌కు వాట్సప్ లో డేటా పంపండి అని అగంతకుడు మెసేజ్ చేశాడు. అంతే, ఆగమేఘాల మీద రంగారెడ్డి కలెక్టరేట్ నుండి డేటాను మొత్తం ఆగంతకుడికి పంపేశారు. 
 
క‌ట్ చేస్తే... ఆ లిస్ట్ లో ఉన్న ఒక్కో సస్పెండ్ అయిన ఉద్యోగికి ఆగంతుకుడు ఫోన్ కాల్స్ చేశాడు. మీకు మళ్ళీ ఉద్యోగం కావాలంటే, తనకు కొంత చెల్లించాలని డిమాండు చేశాడు. స‌స్పెన్ష‌న్ ఎత్తివేయ‌డ‌మే కాకుండా, ప్రమోషన్ కూడా ఇప్పిస్తా అని నమ్మబలికాడు అగంతకుడు. తాము పర్సనల్ గా కలిసి డ‌బ్బు ఇస్తామ‌ని, త‌మ బాధ‌లు చెప్పుకుంటామ‌ని పలువురు ఉద్యోగులు ఆ ఆగంతుకుడిని బ‌తిమిలాడుకున్నారు. కానీ, కోవిడ్ కారణంగా క‌ల‌వ‌లేన‌ని, గూగుల్ పే, ఫోన్ పే చేయాలని కోరాడు ఆ ఆగంతకుడు.
 
అనుమానం వచ్చి రంగారెడ్డి కలెక్టరేట్ లో కొంద‌రు ఉద్యోగులు ఆరా తీశారు. స‌స్పెండ్ అయిన ఉద్యోగుల‌ డేటా మొత్తం రంగారెడ్డి కలెక్టరేట్ నుండి వెళ్లిందని ఆ అధికారి అస‌లు క‌థ చెప్ప‌డంతో ఇదంతా ఎవ‌డో బ్లాక్ మెయిల‌ర్ ప‌ని అని అర్ధం అయింది. త‌మ‌కు ఫోన్ చేసిన వ్య‌క్తి ఆచూకి కోసం సచివాలయంలో ఎంక్వయిరీ చేస్తే, అటువంటి వ్యక్తి ఎవ‌రూ లేకపోవడంతో మోస‌పోయామ‌ని తెలుసుకున్నారు. చివ‌రికి సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments