Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'దేశ్ కే మెంటర్స్' : కొత్త అవతారంలో సోను సూద్

Advertiesment
'దేశ్ కే మెంటర్స్' : కొత్త అవతారంలో సోను సూద్
, శుక్రవారం, 27 ఆగస్టు 2021 (14:03 IST)
ఢిల్లీ రాష్ట్ర ప్ర‌భుత్వం దేశ్ కే మెంట‌ర్స్  పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్య‌క్ర‌మాన్ని త్వ‌ర‌లో ఆవిష్క‌రించ‌నున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. అయితే ఢిల్లీ ప్ర‌భుత్వానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా న‌టుడు సోనూ సూద్ వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు ఆయన తెలిపారు. 
 
ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు సోను సూద్ మాట్లాడుతూ, లక్ష‌లాది మంది విద్యార్థుల‌ను తీర్చిదిద్దేందుకు త‌నకు శిక్ష‌కుడి (మెంట‌ర్‌) రూపంలో అవ‌కాశం ఇవ్వ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.  విద్యార్థుల‌కు దిశానిర్దేశం చేయ‌డం క‌న్నా మ‌రో గొప్ప సేవ‌లేద‌న్నారు. ఢిల్లీ ప్ర‌భుత్వంతో క‌లిసి ఆ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు సోనూ సూద్ తెలిపారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాలీవుడ్ డ్రగ్స్ కేసు: 12 మంది టాలీవుడ్ సెలబ్రిటీస్‌ గుండెల్లో రైళ్లు