Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవి రద్దీ.. విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్ళు

Webdunia
మంగళవారం, 2 మే 2023 (09:51 IST)
వేసవి సీజన్‌లో ప్రయాణికుల రద్దీ నానాటికీ పెరిగిపోతుంది. దీంతో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులోభాగంగా, విజయవాడ మీదుగా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడిపేలా చర్యలు చేపట్టినట్టు రైల్వే అధికారులు తెలిపారు.
 
విశాఖపట్నం - మహబూబ్‌నగర్‌ ప్రత్యేక రైలు మంగళవారం(2వ తేదీ) నుంచి జూన్‌ 28వ తేదీ వరకు విశాఖపట్నంలో సాయంత్రం 5.35 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 10.30 గంటలకు మహబూబ్‌నగర్‌ చేరుకుంటుంది. 
 
తిరుగు ప్రయాణంలో ఇదే రైలు మహబూబ్‌నగర్‌లో సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. ఈ రైలు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, మల్కాజ్‌గిరి, కాచిగూడ, జడ్చర్ల స్టేషన్లలో ఆగుతుంది. 
 
అలాగే, విశాఖపట్నం - తిరుపతి ప్రత్యేక రైలు 2వ తేదీ నుంచి జూన్‌ 27వ తేదీ వరకు విశాఖపట్నంలో రాత్రి 7.10 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. 
 
తిరుగు ప్రయాణంలో ఇదే బండి తిరుపతిలో రాత్రి 9.55 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 10.15 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. 
 
విశాఖపట్నం - బెంగళూరు ప్రత్యేక రైలు ఈ నెల 7వ తేదీ నుంచి 29వ తేదీ వరకు విశాఖపట్నంలో మధ్యాహ్నం 3.55 గంటలకు బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. 
 
తిరుగు ప్రయాణంలో బెంగళూరులో మధ్యాహ్నం 3.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, కుప్పం, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతుంది. 

సంబంధిత వార్తలు

మెంటల్ టార్చర్ భరించడం వల్ల కాదు, ఆ విషయంలో పవన్ చాలా స్ట్రాంగ్: విజయ్ సేతుపతి

మలయాళ, తమిళ సినిమాల్లో బేబెమ్మ.. తెల్ల లెహంగాలో అదుర్స్

ఐదు భాషలలొ మోటివ్ ఫర్ మర్డర్ - టీజర్‌ను రిలీజ్ చేసిన దిల్ రాజు.

హరికృష్ణ మనవడు నందమూరి తారక రామారావు హీరోగా వైవిఎస్ చౌదరి చిత్రం ప్రకటన

బలగం నిర్మాత హర్షిత్ రెడ్డి కజిన్ సుమన్ తేజ్ హీరోగా సీతా కళ్యాణ వైభోగమే

బ్రెయిన్ ట్యూమర్ సర్వైవర్స్‌తో అవగాహన వాకథాన్‌ని నిర్వహించిన కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలిపే 9 కారణాలు

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2024: గర్భిణీ తల్లులకు సురక్షితమైన ఆహార చిట్కాలు

చెరకు రసంతో ప్రయోజనాలు సరే.. అలాంటి వారికి ఇక్కట్లే..

మజ్జిగ ఇలాంటివారు తాగకూడదు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments