ఇటీవల వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌లో శవమై కనిపించిన ఐదు నెలల గర్భిణి శ్వేత కేసులో సంచలన విషయం ఒకటి వెలుగు చూసింది. ఆడపడుచు భర్త నుంచి ఆమె లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. అదేసమయంలో శ్వేత మృతదేహానికి విశాఖ కేజీహెచ్‌లో ముగ్గురు వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. ఈ పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక పోలీసులకు అందజేశారు.
ఇటీవల ఆర్కే బీచ్‌లో అనుమానాస్పద స్థితిలో శవమైన కనిపించిన 24 యేళ్ల శ్వేత మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం పూర్తిచేశారు. ముగ్గురు వైద్యుల బృందం దీన్ని పూర్తి చేసి ప్రాథమిక నివేదికను పోలీసులకు అందజేశారు. శ్వేతతి ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఇదిలావుంటే, ఈ కేసులో మరో విస్తు గొలిపే అంశం ఒకటి వెలుగు చూసింది. ఈ శ్వేత ఆడపడుచు భర్త నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు, దీంతో ఆడపడుచు భర్తపై లైంగిక వేధింపులు, అత్త, ఆడపడుచుపై వరకట్న వేధింపుల కేసులు పెట్టారు.
ఈ కేసులో దర్యాప్తులోభాగంగా, భర్త, అత్త, మామ, ఆడపడుచును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్త తరపు బంధువులందరూ పోలీసుల అదుపులో ఉండటంతో శ్వేత మృతదేహాన్ని తల్లి, ఆమె తరపు బంధువులకు అప్పగించారు. అంత్యక్రియలు కూడా గురువారం నిర్వహించారు.