Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్వేత ఆత్మహత్యకు కారణం వెల్లడించిన వైజాగ్ పోలీసులు!

Advertiesment
swathi vaizag
, శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (19:06 IST)
విశాఖపట్టణం ఆర్కే బీచ్‌లో అనుమానాస్పదస్థితిలో శవమై కనిపించిన శ్వేత (24) ఆత్మహత్య చేసుకున్నట్టు విశాఖ పోలీసులు వెల్లడించారు. ఈమె ఐదు నెలల గర్భవతి అని పోలీసులు తెలిపారు. ఆమె పేరు మీద ఉన్న 90 సెంట్ల భూమిని తన పేరుమీద రాయాలని భర్త మణికంఠ వేధించేవాడని, అలాగే, ఆడపడుచులు కూడా వేధించడంతో, వారి బాధలు తాళలేక బలవన్మరణానికి పాల్పడినట్టు తెలిపారు. దీనిపై విశాఖ పోలీస్ కమినషర్ త్రివిక్రమ్ వర్మ శుక్రవారం సాయంత్ర మీడియాకు వివరించారు. 
 
"శ్వేత గర్భవతి అయిన తర్వాత పుట్టింటికి వెళ్లినపుడు ఆమె తల్లి ఎదుటే భార్యాభర్తలిద్ధరూ గొడవపడ్డారు. తన తల్లి ఎదుటే మణికఠ శ్వేతపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. అపుడే ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా తల్లి కాపాడింది. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. శ్వేత ఆడపడుచులిద్దరూ వారి ఇంటికి సమీపంలోనే ఉంటున్నారు. వారు కూడా తరచూ ఇంటికి వచ్చి భర్తలేని సేమయంలో శ్వేతను వేధించసాగారు. 
 
ఇటీవల జరిగిన పరిణామాలు, సూసైడ్ నోట్ ఆధారంగా శ్వేతది ఆత్మహత్యేనని భావిస్తున్నాం. శ్వేత శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైందని చెప్పారు. శ్వేత తల్లి ఫిర్యాదు మేరకు అత్త మామలు, భర్త, ఆడపడుచులులపై కూడా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా సాక్ష్యాదారాలు సేకరించామని సీపీ వర్మ వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సూపర్ స్టార్ రజనీకాంత్‌కు చంద్రబాబు తేనీటి విందు