Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘బలగం’ప్రెస్‌మీట్... టైటిల్ చూసి ఇదేమో కామ్రేడ్ అనుకోకండి..

Advertiesment
‘బలగం’ప్రెస్‌మీట్... టైటిల్ చూసి ఇదేమో కామ్రేడ్ అనుకోకండి..
, శనివారం, 17 డిశెంబరు 2022 (19:48 IST)
దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత నిర్మిస్తోన్న సినిమా ‘బలగం’. ప్రియ‌ద‌ర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ప్రెస్ మీట్ శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. 
 
ఈ  ప్రెస్ మీట్‌లో ... స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘నేను నిర్మాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్ స్టార్ట్ చేసిన్ప‌పుడు కొత్త‌లో కొత్త ద‌ర్శ‌కుల‌ను, ఆర్టిస్టులును, టెక్నీషియ‌న్స్‌ని ఇంట్ర‌డ్యూస్ చేశాం. త‌ర్వాత ఏమైందంటే ఎదుగుతున్న క్ర‌మంలో రాజుగారి ద‌గ్గ‌రికి వెళితే పెద్ద సినిమాలే చేస్తారు, ఇలాగే ఉంటారంటూ వార్త‌లు వ‌చ్చి కొత్త కాన్సెప్ట్ సినిమాల‌కు బ్రేక్ వ‌స్తుంది. 
 
మారుతున్న ట్రెండ్‌కి అనుగుణంగా ఉండాల‌నే ఉద్దేశంతోనే మా నెక్ట్స్ జ‌న‌రేష‌న్ సినీ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చారు. అందులో భాగంగానే దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్ స్టార్ట్ చేశారు. ఈ బ్యాన‌ర్‌లో డిఫ‌రెంట్ కాన్సెప్ట్ సినిమాలు, ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు చేయాల‌ని అనుకుంటున్నాం. అందులో భాగంగా మేం చేసిన తొలి సినిమా ‘బలగం’. నాకేం  తక్కువ బలగం మస్తుంది.. బంధు బలగం అంటుంటాం కదా.. అలాంటి వాటిలో నుంచే బలగం అనేదాన్ని టైటిల్‌గా తీసుకున్నాం.
 
మా డిస్ట్రిబ్యూట‌ర్ శివ‌రామ్‌ ఈ క‌థ విని న‌చ్చ‌డంతో నా ద‌గ్గ‌ర‌కు దీన్ని తీసుకొచ్చాడు. క‌థ విన‌గానే భ‌లే చేశావ్ వేణు అని అభినందించాను. సాధార‌ణంగా వేణు మ‌న‌కు ఆర్టిస్ట్‌గా, క‌మెడియ‌న్‌గానే తెలుసు. కానీ ద‌ర్శ‌కుడిగా ఓ పూర్తిస్థాయిలో క‌థ చెప్ప‌గానే బాగా న‌చ్చింది. సినిమా చేస్తున్నామ‌ని చెప్పాను. త‌ర్వాతే జ‌ర్నీ స్టార్ట్ అయ్యింది. త‌న‌కు కావాల్సిన‌ట్లు ఆర్టిస్టుల‌ను సెల‌క్ట్ చేసుకున్నాడు. 
 
తెలంగాణ‌లోని సిరిసిల్ల ద‌గ్గ‌ర ఓ గ్రామంలో జ‌రిగే క‌థ‌తో  ‘బలగం’ మూవీ రూపొందింది. నేచుర‌ల్‌గా ఉండేలా వేణు మంచి టీమ్‌ను సెల‌క్ట్ చేసుకుని సినిమా చేశాడు. ప్రియ‌ద‌ర్శి, కావ్యా క‌ళ్యాణ్ రామ్ జంట‌గా న‌టించారు. వీరు త‌ప్ప దాదాపు అంద‌రినీ కొత్త‌వాళ్ల‌నే వేణు సెల‌క్ట్ చేసుకున్నాడు. సినిమా అంతా పూర్త‌య్యింది.సినిమా చూశాకే బ్యాన‌ర్ అనౌన్స్ చేద్దామ‌ని ఆగాను. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను ఇంకా ప్ర‌క‌టిస్తాం. 
 
భీమ్స్ ఫుల్ బిజీగా ఉన్న‌ప్పటికీ ఈ సినిమాకు వ‌ర్క్ చేశాడు. వేణు డైరెక్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ మ్యూజిక్ ప‌రంగా త‌న‌కెలా కావాలో అలాంటి సంగీతాన్ని రాబ‌ట్టుకున్నాడు. అమేజింగ్ సాంగ్స్ రెడీ అయ్యాయి. వాటిని కూడా త్వ‌ర‌లోనే రిలీజ్ చేశాం. వేణు మంచి సినిమాను తీసి మా చేతిలో పెట్టాడు. ఇప్పుడు అలాంటి సినిమాకు ఆడియెన్స్‌ను థియేట‌ర్స్‌కు వ‌చ్చేలా చూడ‌టం మా బాధ్య‌త‌. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.
 
ఎస్‌వీసీకి దిల్ ఎలాగో డిఆర్‌పీకి బ‌లగం అలాంటి సినిమా. డ‌బ్బుతో పాటు మంచి అప్రిషియేష‌న్స్ కూడా వ‌స్తుంది. హ‌ర్షిత్‌, హ‌న్షిత‌ల‌కు  ‘బలగం’ సినిమా మంచి నిర్మాత‌లుగా పేరు తీసుకొస్తుంది. త్వ‌ర‌లోనే సినిమా మీ ముందుకు వ‌స్తుంది. ఎస్‌వీసీ నుంచి వ‌చ్చిన అద్భుత‌మైన సినిమాలు బొమ్మ‌రిల్లు, శ‌త‌మానం భ‌వ‌తి.. ఆ రెండు సినిమాల‌కు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ఎంత గొప్ప అప్రిషియేష‌న్స్‌తో పాటు డ‌బ్బుని కూడా తీసుకొచ్చింది. 
 
అలాగే డీఆర్‌పీ బ్యాన‌ర్‌కి బ‌ల‌గం ఎప్ప‌టికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. సినిమాలో న‌వ్వుతారు, ఏడుస్తారు. అన్ని ఎమోష‌న్స్ ఉంటాయి. సినిమా చూసి నాలుగు సార్లు ఏడ్చాను. టైటిల్ చూసి ఇదేమో కామ్రేడ్ సినిమా అనుకోకండి. మంచి ఫ్యామిలీ మూవీ’’ అన్నారు.
 
చిత్ర ద‌ర్శ‌కుడు వేణు ఎల్దండి మాట్లాడుతూ ‘‘రాజుగారు మా సినిమాలో వేలు పెట్టారు. కాబట్టే మా పోస్టర్ ఇంత క‌ల‌ర్‌ఫుల్‌గా క‌నిపిస్తుంది. ఆయ‌న‌తో మాట్లాడిన ప్ర‌తీసారి మా టీమ్ అంద‌రికీ ఓ ఎన‌ర్జీ వ‌చ్చేది. ముఖ్యంగా నాకు అయితే స్టార్టింగ్‌లో ఆయ‌నొక పెద్ద ప్రొడ్యూస‌ర్ క‌దా, ఎలా తీసుకుంటారోన‌ని భ‌య‌మేసింది. కానీ.. కానీ ఆయ‌న‌తో ట్రావెల్ చేయ‌టం మొద‌లు పెట్టిన త‌ర్వాత ఎంటైర్ యూనిట్‌లో ఆయ‌న‌తోనే కంఫ‌ర్ట్‌గా ఫీల్ అయ్యాను. 
 
కాన్ఫిడెంట్‌గా స‌పోర్ట్ చేశారు. 5 ఏళ్ల కల‌. ద‌ర్శ‌కుడిగా నా పేరుని పోస్ట‌ర్‌పై చూసుకోవాల‌నే క‌ల ఈ రోజుతో నేర‌వేరింది. అందుకు దిల్‌రాజుగారికి థాంక్స్‌. న‌న్ను నమ్మి చాలా స‌పోర్ట్ చేశారు. శిరీష్‌గారు అందించిన పాజిటివ్ స‌పోర్ట్‌తో ఎంతో బ‌లం వ‌చ్చేది. అలాగే హ‌ర్షిత్‌, హ‌న్షిత గారికి కూడా థాంక్స్‌. ప్ర‌తి ఇంట్లో జ‌రిగే సిట్యువేష‌న్‌తో న‌డిచే క‌థ‌. సినిమా చూసినంతసేపు న‌వ్వుకుంటారు, ఎమోష‌న్ అవుతారు. తెలంగాణ బ్యాక్డ్రాప్‌లో తీసిని సినిమా అయినప్ప‌టికీ తెలుగు వారంద‌రికీ క‌నెక్ట్ అయ్యే సినిమా ఇది’’ అన్నారు.
 
యాక్ట‌ర్ ప్రియద‌ర్శి మాట్లాడుతూ ‘‘దిల్‌రాజుగారు ఫ్యామిలీలో హ‌ర్షిత్‌, హ‌న్షిత‌గారు క‌లిసి స్టార్ట్ చేసిన డిఆర్‌పీ బ్యాన‌ర్‌లో వ‌స్తున్న తొలి సినిమాలో నేను క‌థానాయ‌కుడిగా న‌టించ‌టం హ్యాపీ. ఫ్యామిలీ చిత్రాల‌కు ఎస్‌వీసీ బ్యాన‌ర్ పెట్టింది పేరు. ఎన్నో మంచి ఫ్యామిలీ చిత్రాలు ఆ బ్యాన‌ర్ నుంచి వ‌చ్చాయి. ఈ సినిమా కూడా ఆ సినిమాల స్థాయిలో ఉండాల‌ని కోరుకుంటున్నాను. వేణుగారు ఎంత గొప్ప డైరెక్ట‌రో ఈ సినిమాతో అర్థ‌మ‌వుతుంది. చాలా మంచి టీమ్‌తో క‌లిసి ప‌నిచేశాను. బ‌లగం సినిమాకు ప్రేక్ష‌కులు స‌పోర్ట్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.
 
కావ్యా క‌ళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘‘బలగం అందరినీ మెప్పించే మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉది. ఎగ్జ‌యిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాం. వేణుగారు అద్భుత‌మైన న‌టుడు. ఆయ‌న నెరేష‌న్ ఇచ్చిన‌ప్పుడు క‌థ న‌చ్చింది. ఇక షూటింగ్ చేస్తున్న‌ప్పుడు అయితే ఆ నెరేష‌న్ కంటే ఇంకా చ‌క్క‌గా సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు అనిపించింది. రేపు సినిమా చూసి ప్రేక్ష‌కులు కూడా ఎంజాయ్ చేస్తార‌ని అనుకుంటున్నాం’’ అన్నారు.
 
నిర్మాత హ‌న్షిత మాట్లాడుతూ ‘‘ఎస్‌వీసీ బ్యాన‌ర్ లెగ‌సీతో వ‌స్తున్న మ‌రో బ్యాన‌ర్‌. అయితే డిఫ‌రెంట్ ఐడియాల‌జీతో ముందుకు వెళ‌తాం. ప్ర‌తి కొత్త దర్శ‌కుడు, కంటెంట్‌ను ప్రేక్ష‌కుల‌కు అందించ‌టానికి మేం డిఆర్‌పీ బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేశాం. మా మెయిల్ ఐడీని కూడా మీకు అందిస్తాం. అందులో మీ కొత్త కంటెంట్‌ను మాకు పంపొచ్చు. అలాంటి డిఫ‌రెంట్ కంటెంట్ కోసం మేం వెయిట్ చేస్తున్నాం. ఈ బ్యాన‌ర్‌లో వ‌స్తున్న బ‌లగం మా తొలి సినిమా. ప్ర‌తి ఇంట్లో ఉండే ఎమోష‌న్ ఈ సినిమా పాయింట్‌. అంద‌రూ క‌నెక్ట్ అవుతారు’’ అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ ‘‘నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన దిల్ రాజుగారికి, డైరెక్ట‌ర్ వేణుగారికి ముందుగా థాంక్స్‌. అలాగే శిరీష్‌గారికి, హర్షిత్‌,హన్షిత‌, ప్రియ‌ద‌ర్శి స‌హా అంద‌రికీ మ‌న‌స్ఫూర్తిగా థాంక్స్ చెప్పుకుంటున్నాను’’ అన్నారు. ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో ర‌చ్చ ర‌వి స‌హా యూనిట్ స‌భ్యులంద‌రూ పాల్గొన్నారు.
 
న‌టీన‌టులు:  
ప్రియద‌ర్శి, కావ్యా క‌ళ్యాణ్ రామ్‌, సుధాక‌ర్ రెడ్డి, ముర‌ళీధ‌ర్ గౌడ్‌, రూప లక్ష్మి, జ‌య‌రాం, విజ‌య‌ల‌క్ష్మి త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
ఎ దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్
స‌మ‌ర్ప‌ణ‌:  శిరీష్‌
ద‌ర్శ‌క‌త్వం:  వేణు ఎల్దండి
నిర్మాత‌లు: హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత‌
సినిమాటోగ్ర‌ఫీ:  ఆచార్య వేణు
సంగీతం:  భీమ్స్ సిసిరోలియో
ఎడిట‌ర్‌:  మ‌ధు
పాట‌లు:  శ్యామ్ కాస‌ర్ల‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:  ర‌మ‌ణ వంక‌.
మాట‌లు: వేణు ఎల్దండి, రమేష్ ఎలిగేటి - నాగరాజు మడూరి
కథా విస్తరణ - స్క్రీన్ ప్లే: రమేష్ ఎలిగేటి - నాగరాజు మడూరి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Avatar 2 చూస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి