Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీసీసీ అధ్యక్షుడిగా శైలజానాథ్‌

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (17:16 IST)
కాంగ్రెస్‌ నేత శైలజానాథ్‌ ఏపీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. శైలజానాథ్‌ను ఏపీసీసీ చీఫ్‌గా నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లుగా మస్తాన్‌ వలీ, తులసిరెడ్డిలను కాంగ్రెస్‌ అధిష్టానం నియమించింది.

ఇంతకాలం ఏపీ పీసీసీ చీఫ్‌గా రఘువీరారెడ్డి ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని సీనియర్ నేతలంతా వీడినా.. రఘువీరా మాత్రం హస్తం పార్టీలోనే కొనసాగారు. 2014, 2019 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ఒంటరిగా పోటీ చేసి ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా గెలవలేదు.
 
ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తులసిరెడ్డి నియామకం అయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఆయన ఉన్నారు. గతంలో 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్‌గా పని చేసిన తులసిరెడ్డి .. ఎంపీగా, ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు.

రాష్ట్ర విభజన తర్వాత మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరారు. అనంతరం జరిగిన పరిణామాలతో తులసి రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో ఆయన బీజేపీ, టీడీపీలో కూడా కీలక పదవులు అనుభవించారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments