Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్‌లో కమలసేన ప్రభుత్వం తథ్యం : కన్నా లక్ష్మీనారాయణ

Advertiesment
Kanna Laxmi Narayana
, గురువారం, 16 జనవరి 2020 (16:18 IST)
వచ్చే 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని బీజేపీ రాష్ట్ర శాఖ కన్నా లక్ష్మీ నారాయణ తెలిపారు. గురువారం విజయవాడలో బీజేపీ - జనసేన పార్టీల నేతల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం కన్నా లక్ష్మీ నారాయణ విలేకరులతో మాట్లాడారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమతో కలిసి పనిచేసేందుకు జనసేన ముందుకు వచ్చిందని తెలిపారు. ఏపీలో సామాజిక న్యాయం బీజేపీ - జనసేనతోనే సాధ్యమని బలంగా నమ్ముతున్నామన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ అవినీతిపైనా, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం నిరంకుశ పాలనపైనా కలిసి పోరాటం సాగిస్తామన్నారు. 
 
ప్రజావ్యతిరేక విధానం ఏదైనా బీజేపీ, జనసేన సంయుక్తంగా ఉద్యమిస్తాయని చెప్పారు. బీజేపీ, జనసేన సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతం నుంచి రాజధాని తరలింపును వ్యతిరేకించాలన్న అంశాలపై రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు సమాచారం. 
 
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏకపక్షంగా రాజధానిని తొలగించాలని నిర్ణయింస్తే రోడ్లపైకి వచ్చి పోరాడుతామని ప్రకటించారు. అంతేకాకుండా, 2024లో వచ్చేది తమ ప్రభుత్వమేనని కన్నా జోస్యం చెప్పారు. ఆ దిశగా తమ రెండు పార్టీలు కృషి చేస్తాయని తెలిపారు. రాజధాని అమరావతి అంశంలో కలిసి పని చేస్తామని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చేతులు కలిపిన "కమలసేన" - ఇక జగన్ జైలుకేనా?