Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజధానిపై పోరుబాట : 16న జనసేన - బీజేపీ కీలక భేటీ

Advertiesment
రాజధానిపై పోరుబాట : 16న జనసేన - బీజేపీ కీలక భేటీ
, బుధవారం, 15 జనవరి 2020 (14:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, అమరావతి రాజధాని మార్పు తదితర అంశాలను బీజేపీ పెద్దల దృష్టికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకెళ్లారు. పవన్ తమ దృష్టికి తీసుకొచ్చిన అంశాలపై బీజేపీ కేంద్ర నాయకత్వం తక్షణం స్పందించింది. ఇందులోభాగంగా, ఈనెల 16వ తేదీన విజయవాడ కేంద్రంగా జనసేన - బీజేపీ నేతల సమన్వయ సమావేశం జరుగనుంది. అమరావతి రాజధాని ఉద్యమం ఏపీలో ఉవ్వెత్తున ఎగిసిపడుతోన్న నేపథ్యంలో దీనిపై ఇరు పార్టీల నేతలు గురువారం చర్చించనున్నట్టు తెలుస్తోంది. 
 
ఈ సమావేశానికి బీజేపీ అధిష్టానం తరపున సునీల్ డియోరాతోపాటు మరో సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలు రాష్ట్రానికి రానున్నారు. అలాగే, జనసేన పార్టీ తరపున అధినేత పవన్ కళ్యాణ్, సీనియర్ నేత నాదెండ్ల మనోహర్‌లు పాల్గొననున్నారు. 
 
ఈ సమన్వయ భేటీపై స్పందిస్తూ, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ స్పందించారు. రాష్ట్ర అభివృద్ధిపై తమ పార్టీ మొదటి నుంచి ఒకే మాటపై ఉందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టామన్నారు. ఏపీ సీఎం మారినప్పుడల్లా రాజధానిని మార్చడం సరికాదన్నారు. కాగా, జనసేన - బీజేపీ సమన్వయ భేటీలో ఇరు పార్టీల నేతలు ఏయే విషయాలపై చర్చిస్తారన్న అంశంపై ఇపుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉరిపై కొత్త ట్విస్ట్ : అది తేలేవరకు ఉరితీయలేమంటున్న ఢిల్లీ సర్కారు