Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రెండు బలహీన పార్టీలు కలవడం వల్ల మాకు నష్టం లేదు: వైకాపా ఎంపీ

రెండు బలహీన పార్టీలు కలవడం వల్ల మాకు నష్టం లేదు: వైకాపా ఎంపీ
, గురువారం, 16 జనవరి 2020 (11:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత బలహీనంగా ఉన్న రెండు పార్టీలు కలవడం వల్ల తమకు వచ్చే నష్టమేమీ లేదని అధికార వైకాపా ఎంపీ రఘురామ కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. గురువారం విజయవాడలో భారతీయ జనతా పార్టీ - జనసేన పార్టీల అగ్రనేతల మధ్య సమన్వయ సమావేశం జరుగుతున్న విషయం తెల్సిందే. 
 
దీనిపై రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ, ఎక్కడైనా రెండు బలహీనమైన పార్టీలు బలపడాలని కోరుకుంటే పొత్తుతో ముందడుగు వేయాలనుకుంటాయని, రాష్ట్రంలో బీజేపీ, జనసేన పార్టీలది అటువంటి ప్రయత్నమేనని చెప్పారు. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కారణంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు.
 
పైగా, రెండు పార్టీల విధానాలేమిటో గురువారం సాయంత్రంలోగా తేలుతుందని, ఆ తర్వాత పరిస్థితిని అంచనా వేయొచ్చన్నారు. ఏదిఏమైనా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు వల్ల ఒనగూరే ఫలితం ఏమిటన్నది తేలాలంటే నాలుగున్నరేళ్లపాటు ఆగాలని రఘురామకృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. ఏది జరిగినా అత్యంత బలంగా తమ పార్టీకి జరిగే నష్టమేమీ లేదన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పేరుకేమో క్యాస్టింగ్ డైరక్టర్.. కానీ జూనియర్ ఆర్టిస్టులతో..?