Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోడిపందేల్లో విషాదం.. వ్యక్తి మృతి

Advertiesment
కోడిపందేల్లో విషాదం.. వ్యక్తి మృతి
, గురువారం, 16 జనవరి 2020 (08:12 IST)
సంక్రాంతిని పురస్కరించుకుని నిర్వహించిన కోడిపందేల్లో విషాదం చోటుచేసుకుంది. కోడికత్తి తగిలి ఒకరు మృతిచెందారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. పండగ సందర్భంగా గ్రామానికి సమీపంలోని పామాయిల్‌ తోటల్లో కోడిపందేలు నిర్వహించారు. కోళ్ల కాళ్లకు కత్తులు కడుతుండగా సరిపల్లి వెంకటేశ్వరరావు (55) అనే వ్యక్తి అక్కడ నిలబడి ఉన్నారు.
 
ఈ క్రమంలో ఓ కోడిపుంజు ఒక్కసారిగా కాళ్లు విదిలించడంతో పక్కనే ఉన్న వెంకటేశ్వరరావు తొడభాగంలో కత్తి గుచ్చుకుంది. దీంతో బాగా రక్తస్రావం జరగడంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. అక్కడ ఉన్నవారు వెంటనే స్పందించి హుటాహుటిన చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

వెంకటేశ్వరరావును పరిశీలించిన వైద్యులు.. అప్పటికే మృతిచెందినట్లు ప్రకటించారు. సమాచారం అందించడంతో పోలీసులు ఆస్పత్రికి వచ్చి వెంకటేశ్వరావు మృతదేహాన్ని పరిశీలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో గదుల బుకింగ్ కు కొత్త నిబంధనలు