Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబూ నిజాలు తెలుసుకుని మాట్లాడండి.. పయ్యావుల అసహనం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తాను ఏకాంతంగా మాట్లాడటాన్ని చంద్రబాబు తప్పుబట్టడాన్ని పయ్యావుల జ

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2017 (08:58 IST)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తాను ఏకాంతంగా మాట్లాడటాన్ని చంద్రబాబు తప్పుబట్టడాన్ని పయ్యావుల జీర్ణించుకోలేక పోవడమే కాదు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇదే అంశంపై పయ్యావుల మాట్లాడుతూ, ఈ విషయంలో చంద్రబాబుకు సరైన సమాచారం అందలేదని, అందువల్లే తాను మాటలు పడాల్సి వచ్చిందని ఇతర టీడీపీ నేతల వద్ద ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. జరిగిన ఘటనలో తన తప్పేముందని ప్రశ్నించారు. 
 
పరిటాల శ్రీరామ్ పెళ్లికి అందరిలాగానే తాను కూడా ఓ అతిథిగా వచ్చానని, కేసీఆర్ కనిపిస్తే, ఓ నమస్కారం పెట్టి వెళ్లిపోయానన్నారు. తనతో వచ్చిన ఓ ఉన్నతాధికారిని పంపి నన్ను పిలిపించగా, వెళ్లకుంటే బాగుండదన్న ఉద్దేశంతో కేసీఆర్ దగ్గరికి వెళ్లినట్టు వివరించారు. ఆ తర్వాత సీఎం కేసీఆరే స్వయంగా తన చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకెళ్లి మాట్లాడారని గుర్తు చేశారు. తానేమీ స్వయంగా వెళ్లి ఏకాంత భేటీలు జరపలేదన్నారు. చెయ్యని తప్పుకు మాటపడటం బాధను కలిగించిందని వాపోయారు. 
 
తెలంగాణ ప్రాంతానికి చెందిన రేవంత్, రమణలు చంద్రబాబుతో సమావేశమై ఈ అంశాన్ని ప్రస్తావన తెచ్చారన్నారు. ఈ తరహా చర్యల ద్వారా కింద స్థాయిలో కార్యకర్తలకు సమాధానం చెప్పలేకపోతున్నామని, ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీకి రాజీనామా మినహా మరో మార్గం తమ ముందు ఉండబోదని తన సహచరుల వద్ద వాపోయినట్టు సమాచారం. ఇరు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఉందనీ, ఇరు రాష్ట్రాల టీడీపీ నేతలకు ఆయనే పెద్ద అని అలాంటపుడు అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments