Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరెస్సెస్‌లోని మహిళలు నిక్కర్లు ధరించడం చూశారా?: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ ఉఫాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరెస్సెస్‌లోని మహిళలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరెస్సెస్‌లోని మహిళలు నిక్కర్లెందుకు ధరించరని ప్రశ్నించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)లోని మహిళలపై వివక్

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2017 (08:52 IST)
కాంగ్రెస్ ఉఫాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరెస్సెస్‌లోని మహిళలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరెస్సెస్‌లోని మహిళలు నిక్కర్లెందుకు ధరించరని ప్రశ్నించారు.  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)లోని మహిళలపై వివక్ష కొనసాగుతోందన్నారు. వారెప్పుడైనా నిక్కర్లు ధరించడం చూశారా? అని ప్రశ్నించారు.

ఆరెస్సెస్ కార్యకర్తలు నిక్కర్లు ధరిస్తారని, కానీ ఆ సంస్థలోని మహిళలకు మాత్రం అ అవకాశం లేదని వాపోయారు. విద్య, ఆరోగ్య రంగాలపై కూడా దృష్టిపెడుతుందన్నారు. మీకేం కావాలో తెలుసుకోవడానికి మీతో నరేంద్ర మోదీ ఎప్పుడైనా మాట్లాడారా? అని అడిగారు.
 
బీజేపీకి ఆరెస్సెస్ ప్రధాన సంస్థ.. అందులో ఎందరు మహిళలున్నారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మహిళలు నోరు తెరవడాన్ని బీజేపీ, ఆరెస్సెస్ అంగీకరించవని, వారు మౌనంగా ఉండాలనే కోరుకుంటాయని ఆరోపించారు. వారి నోళ్లు మూయించేందుకు ఆ రెండూ పరుగులు తీస్తుంటాయన్నారు. గుజరాత‌లో కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే మహిళా సాధికారతపై దృష్టిసారిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments