Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టిటిడి పాలకమండలి సభ్యుడిగా కమెడియన్ వేణు మాధవ్?

నంద్యాల ఉపఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏకేసిన వేణుమాధవ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాగానే గుర్తు పెట్టుకున్నారు. ఫైర్ బ్రాండ్ రోజాతో పాటు జగన్మోహన్ రెడ్డిలు ఇద్దరినీ టార్గెట్ చేసి మరీ విమర్శలు చేశారు వేణు మాధవ్. ప్రభుత్వం చేస

Advertiesment
టిటిడి పాలకమండలి సభ్యుడిగా కమెడియన్ వేణు మాధవ్?
, శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (17:12 IST)
నంద్యాల ఉపఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏకేసిన వేణుమాధవ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాగానే గుర్తు పెట్టుకున్నారు. ఫైర్ బ్రాండ్ రోజాతో పాటు జగన్మోహన్ రెడ్డిలు ఇద్దరినీ టార్గెట్ చేసి మరీ విమర్శలు చేశారు వేణు మాధవ్. ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గొప్పతనం గురించి తన ప్రసంగంలో సుధీర్ఘంగా  నంద్యాల ఉప ఎన్నికల్లో మాట్లాడారు వేణుమాధవ్. వేణుమాధవ్ ప్రచారమా.. లేక ప్రభుత్వం చేసిన అభివృద్ధా అనేది పక్కన పెడితే ఉప ఎన్నికల్లో టిడిపి గెలిచిపోయింది.
 
టిడిపి గెలుపుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు చెప్పిన బాబు కొంతమందిని మాత్రం బాగానే  గుర్తు పెట్టుకున్నారు. అందులో కమెడియన్ వేణు మాధవ్ ఒకరు. చేసిన ప్రచారం వారం రోజులే అయినా పదునైన విమర్శలతో ప్రతిపక్ష నేతలు నోర్లను అమాంతం మూయించారు. ఇది బాగా నచ్చింది బాబుకు. అందులోను వేణుకు బాబంటే ఎంతో ఇష్టం. 
 
గతంలో కూడా ఎన్నో సినిమాల విజయోత్సవ సభలో చంద్రబాబుపై తనకు ఉన్న ప్రేమతో ప్రసంగాలు కూడా చేశారు. ఇదే బాబుకు బాగా నచ్చింది. అందుకే వేణు మాధవ్ అడక్కుండానే టిటిడి పాలకమండలి సభ్యుడి పదవి ఇచ్చేందుకు సిద్థమైనట్లు తెలుస్తోంది. వేణు మాధవ్ ఆ విధంగా గోవిందుడు సేవలో తరిస్తారన్నమాట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ్యవసాయ రంగంలో గేట్స్ ఫౌండేషన్ సహకారం... మంత్రి సోమిరెడ్డి