Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్‌ కళ్యాణ్‌ను అంత మాటన్నారా? చంద్రబాబు అసంతృప్తి...

పవన్ కళ్యాణ్ ఎవరో తమకు తెలియదంటూ ఇరువురు మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏ సందర్భంలో ఈ తరహా వ్యాఖ్యలు చేశారని ఆరా తీసినట్లు సమాచారం. పార్టీకి ఇబ్బందికర పరిస్థితిని సృష్టించవద్దనీ, సున్ని

Advertiesment
పవన్‌ కళ్యాణ్‌ను అంత మాటన్నారా? చంద్రబాబు అసంతృప్తి...
, శుక్రవారం, 6 అక్టోబరు 2017 (21:45 IST)
పవన్ కళ్యాణ్ ఎవరో తమకు తెలియదంటూ ఇరువురు మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏ సందర్భంలో ఈ తరహా వ్యాఖ్యలు చేశారని ఆరా తీసినట్లు సమాచారం. పార్టీకి ఇబ్బందికర పరిస్థితిని సృష్టించవద్దనీ, సున్నితమైన విషయాలపై ఆచితూచి మాట్లాడాలని హితవు పలికినట్లు తెలుస్తోంది. జనసేన మన మిత్రపక్ష పార్టీ అనీ, మిత్రపక్ష పార్టీ పట్ల ఇలాగేనా మాట్లాడేది అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
 
మరోవైపు తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ దాదాపుగా తెగతెంపులు చేసుకున్నట్టు అనిపిస్తోంది. అదీ కూడా ఒక్క ట్వీట్‌తో పవన్ కల్యాణ్ తన మనసులోని మాటను చెప్పకనే చెప్పారు. ఈ ట్వీట్ శుక్రవారం ఉదయం చేశారు. ఈ ట్వీట్ ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 
 
ఎజెండా, జెండాలేని పవన్ గురించి ఆలోచించే తీరిక, సమయం తనకు లేవని మంత్రి పితాని సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను, గతంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ, వారికి తానెవరో తెలియదు, సంతోషమని పవన్ పెట్టిన ట్వీట్‌ను విశ్లేషిస్తున్న రాజకీయ నిపుణులు, తెదేపాతో తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఆయనిలాంటి ట్వీట్ చేసుంటారని అంచనా వేస్తున్నారు. 
 
ఒక్క ట్వీట్‌తో ఆయన తన వైఖరిని స్పష్టం చేశారని, తన బలాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారంటూ హెచ్చరికలు జారీ చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేసుంటారని అంటున్నారు. 2014 ఎన్నికల్లో ప్రచారానికి తనను వాడుకుని, ఇప్పుడు తానెవరో తెలియదంటూ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఎంత ఆగ్రహంగా ఉండకపోతే, పేర్లను ప్రస్తావిస్తూ మరీ పవన్ వ్యంగ్యాస్త్రాన్ని వదులుతూ కామెంట్స్ చేస్తున్నారూ అని భావిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

32 ఏళ్లు నన్ను వాడుకున్నాడు... భాజపా అభ్యర్థి ఫోటోలు వైరల్