Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ నేత గుప్తా దాడి ఘ‌ట‌న‌పై సూమోటోగా కేసు...

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (11:04 IST)
ఒంగోలు వైసీపీ నేత సుబ్బారావుపై దాడి చేసిన సొంత పార్టీ నేతల వ్య‌వ‌హారం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ దాడి చేస్తున్న దృశ్యాల్ని వీడియో తీసి మరీ వార్నింగ్ ఇచ్చిన సుభానీ గ్యాంగ్ పైన పోలీసులు సూమోటోగా రెండు కేసులు పెట్టారు.


ఒక స‌భ‌లో వైసీపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేసిన సుబ్బారావు గుప్తాపై వైసీపీ గ్యాంగ్ దాడి చేసింది. వారి నుంచి ప్రాణ భయంతో ఓ లాడ్జ్‌లో ఉన్న సుబ్బారావు ఆచూకీ కనిపెట్టి మరీ దాడి చేశారు. సుబ్బారావుపై దాడి చేసిన మంత్రి బాలినేని అనుచరుడు సుభానీపై పోలీసులు కేసులు పెట్టారు. 
 
 
ఓ మంత్రి, ఎమ్మెల్యేల మాటలతో పార్టీకి నష్టం జరుగుతుందని ఇటీవల మంత్రి బాలినేని బర్త్ డే వేడుకల్లో మాట్లాడిన సుబ్బారావు గుప్తాపై దాడి జ‌రిగింది. సుబ్బారావు వ్యాఖ్యలపై ఆగ్రహంతో దాడి చేసిన సుభానీ నిన్న రాత్రి సుబ్బారావు ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించాడు.


పార్టీకి నష్టం కలుగుతుందనే అలా మాట్లాడానన్న సుబ్బారావు బాలినేనికి క్షమాపణ చెప్పాలంటూ గుప్తాను మోకాళ్లపై కూర్చోపెట్టి క్షమాపణ చెప్పించాడు సుభానీ. ఈ దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో పోలీసులు సూమోటోగా కేసులు పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments