మాజీ మంత్రి వివేకాను ఎవరు హత్య చేశారో త్వరలోనే తెలుస్తుందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. లోక్ సభలో రెబల్ ఎంపీ రఘరామ, అమరావతి రైతుల పాదయాత్రపై మాట్లాడటం వివాదాస్పదం అయిన సంగతి తెలిసింది. ఈ సందర్భంలో తాను మాట్లాడతూండగా, తోటి వైసీపీ ఎంపీలు తనపై అమర్యాదగా ప్రవర్తించారని, బూతులు తిట్టారని ఎంపీ రఘరామ ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తిరిగి తన వాగ్బాణాలను వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఎక్కుపెడుతున్నారు.
లోక్ సభలో తనను ఉద్దేశించి వైకాపా ఎంపీలు అసభ్యకరంగా మాట్లారన్నఎంపీ రఘురామ చట్ట సభల్లో అసభ్య పదజాలాన్ని ప్రోత్సహించడం మంచిది కాదని హితవు పలికారు. ఇక మాజీ మంత్రి వివేకాను ఎవరు హత్య చేశారో త్వరలోనే తెలుస్తుందని జోస్యం చెప్పారు. తననెవరూ బెదిరించలేరని, తనను బెదిరించేవాళ్లే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
లోకసభలో తనను ఉద్దేశించి వైకాపా ఎంపీలు ఒక అసభ్యక పదం వాడారని, సీఎం జగన్ ప్రోత్సాహంతోనే చట్టసభల్లో ఆ అసభ్య పదజాలాన్ని వైకాపా ఎంపీలు మాట్లాడుతున్నట్లుందని అన్నారు. దిక్కుమాలిన ఆలోచనల నుంచి జగన్ బయటకు రావాలని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సూచించారు.