Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒమిక్రాన్ ఎఫెక్ట్ : సౌతాఫ్రికా పర్యటనను వాయిదా వేసిన బీసీసీఐ

ఒమిక్రాన్ ఎఫెక్ట్ : సౌతాఫ్రికా పర్యటనను వాయిదా వేసిన బీసీసీఐ
, గురువారం, 2 డిశెంబరు 2021 (12:45 IST)
ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ కరోనా వేరియంట్ భయపెడుతోంది. ఈ వైరస్ దెబ్బకు అనేక ప్రపంచ దేశాలు ప్రయాణ ఆంక్షలను సైతం అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఈ ఆంక్షలను అధికంగా విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు జరుపతలపెట్టిన సౌతాఫ్రికా క్రికెట్ టూర్‌ వాయిదాపడింది. ఈ మేరకు బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
నిజానికి ఈ నెల 17వ తేదీ నుంచి ఈ పర్యటన మొదలుకానుంది. టెస్ట్, వన్డే, టీ20 సిరీస్‌లు ఇరు జ్టల మధ్య జరగాల్సివుంది. అయితే, సౌతాఫ్రికా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉంది. ఈ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేయాలని బీసీసీఐ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖతో బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్‌ 2022: సీఎస్కే రీటైన్ ఆటగాళ్లలో ధోనీ.. కానీ జడేజా కంటే?