Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొండ‌ప‌ల్లిలో ఇందిర‌మ్మ కాల‌నీలో కామ‌న్ స్థ‌లంపై వైసీపీ నేతల క‌న్ను

కొండ‌ప‌ల్లిలో ఇందిర‌మ్మ కాల‌నీలో కామ‌న్ స్థ‌లంపై వైసీపీ నేతల క‌న్ను
విజ‌య‌వాడ‌ , సోమవారం, 6 డిశెంబరు 2021 (19:00 IST)
కొండపల్లి మునిసిపాలిటీ ఎన్నికల్లో తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు ఇంకా ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడకపోవడం బాధాకరమని కొండపల్లి మునిసిపాలిటీ టిడిపి అధ్యక్షులు చుట్టుకుదురు శ్రీనివాసరావు అన్నారు. 
 
 
కొండపల్లి మునిసిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో ప్రజలకు సంబంధించిన కామన్ స్థలాన్ని బలవంతంగా తీసుకోవాలనుకోడం సరికాదన్నారు. ప్రభుత్వాసుపత్రి నిర్మాణం చేయాలనుకుప్పుడు మొదట స్థానికులతో మాట్లాడి వారి అభిప్రాయాలు సేకరించాల్సింది పోయి, చేతిలో అధికారం ఉంది కదా అని బలప్రయోగం చేస్తే ప్రజల నుంచి రానున్న కాలంలో మరింత వ్యతిరేకత మూట కట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా కొండపల్లి మునిసిపాలిటీ టిడిపి చైర్మన్ అభ్యర్థి చెన్నుబోయిన చిట్టిబాబు , 13వ వార్డు కౌన్సిలర్ చనుమోలు నారాయణ లతో కలిసి తహసీల్దార్ కు , పోలీసు స్టేషన్ లో వినతిపత్రం అందజేశారు.
 
చెన్నుబోయిన చిట్టిబాబు మాట్లాడుతూ, ప్రభుత్వం ఏదైనా అభివృద్ధి చేయాలనుకున్న సందర్భంలో ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. అధికారులు ప్రజల ఆవేదన కూడా దృష్టిలో ఉంచుకుని ఎవరికి ఇబ్బందులు లేకుండా ఆసుపత్రి నిర్మాణం చేస్తే సరిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు ప్రకాష్ తో పాటు పలువురు టిడిపి కార్యకర్తలు, ఇందిరమ్మ కాలనీలో ప్రజలు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంబేద్కర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసిన మేయర్ భాగ్యలక్ష్మి