Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో... పార్టీల‌కు అతీతంగా నివాళి

Advertiesment
all party leaders
విజ‌య‌వాడ‌ , శనివారం, 4 డిశెంబరు 2021 (18:41 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు ఆంధ్ర రత్న భవన్ లో పలు పార్టీలకు చెందిన నాయకులు పుష్పాంజలి ఘటించారు. పార్టీల‌కు అతీతంగా అంద‌రూ క‌ద‌లి వ‌చ్చి రోశ‌య్య‌కు నివాళి అర్పించారు. 
 
 
విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోశయ్య  చిత్ర పటానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎంఎల్సీ జల్లి విల్సన్, ఓబులేసు తదితర నాయకులు  పుష్పాంజలి ఘటించారు. 

 
ఈ కార్యక్రమంలో ఏపీసిసి ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్)  పరసా రాజీవ్ రతన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలను కొండ శివాజీ, విజయవాడ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహ రావు, లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ వలిబోయిన గురునాధం, రాష్ట్ర ఆర్టీఐ చైర్మన్ పి .వై  కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేఘా ఇంజినీరింగ్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఎలక్ట్రిక్ బస్సులు