సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు విజ‌య‌వాడకు వ‌స్తున్న ఉమెన్ చాందీ

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (10:43 IST)
ఆంధ్ర రత్న భవన్ లో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు ప్ర‌త్యేకంగా ఉమెన్ చాందీ విజ‌య‌వాడ‌కు వ‌స్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఉమెన్ చాందీ మంగళవారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఈనెల 21, 22 తేదీలలో ఆయన విజయవాడ లో బస చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ  నేతలతో జరిగే సమావేశాల్లో పాల్గొంటారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ తెలిపారు. 
 
 
ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానితులు, సీనియర్ నాయకులతో ఉమెన్ చాందీ సమావేశమవుతారు. అలాగే 22న ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో పీసీసీ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1గంట నుంచి 3 గంటల వరకు పలువురు పార్టీ శ్రేణులు ఆయనతో సమావేశమవుతారు.
 
 
రానున్న క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం 7 గంటలకు విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లోఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఉమెన్ చాందీతో పాటు ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ పాల్గొంటారని  ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి , ఇంఛార్జి (ఆర్గనైజేషన్) పరస రాజీవ్ రతన్ వెల్లడించారు. ఈ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరు కావాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments