Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజ‌య‌వాడ న‌గ‌రాన్ని నంద‌న‌వ‌నంలా మార్చ‌డానికి యూ.ఎన్. స‌హ‌కారం

విజ‌య‌వాడ న‌గ‌రాన్ని నంద‌న‌వ‌నంలా మార్చ‌డానికి యూ.ఎన్. స‌హ‌కారం
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 17 డిశెంబరు 2021 (13:59 IST)
యునైటెడ్‌ నేషన్స్‌– హబిటాట్ సీనియర్‌ ప్రతినిధుల‌తో విజ‌య‌వాడ న‌గ‌ర మేయ‌ర్ రాయన భాగ్యలక్ష్మి స‌మావేశం అయ్యారు. మాన్సీ, ఆస్థా, సాలిడ్‌ వేస్ట్ మేనేజ్మెంట్‌ ఎక్స్పర్ట్  స్వాతి సింగ్‌ లతో కూడిన ప్రతినిధులు అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదాదేవితో  కలసి నగర మేయర్ తో సమావేశం అయ్యారు.


సుస్థిర నగరాలుగా అభివృద్ధిపరచాలనే లక్ష్యంగా యునైటెడ్‌ నేషన్స్‌ హ్యూమన్‌ సెటిల్మెంట్‌ ప్రోగ్రాంలో భాగంగా యున్ – హబిటాట్ ప్రతినిధుల బృందం విజయవాడ నగరన్ని సందర్శించింది. ఇక్కడి భౌగోళిక పరిస్థితులపై పూర్తి స్థాయిలో అద్యయనం చేసి అధికారులతో చర్చించి ప్రణాళికలు రూపొందిస్తున్న‌ట్లు ప్ర‌తినిధి బృందం వివరించింది.  
                                                                                          
 
ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, భవిష్యత్ లో విజ‌య‌వాడ న‌గ‌ర ప్రజలకు పూర్తి స్థాయిలో మెరుగైన మౌలిక వసతులు కల్పించ‌డంలో స‌హ‌క‌రించాల‌ని కోరారు. నగరాన్ని పరిశుభ్ర, సుందర నగరంగా తీర్చిద్దిద్ద‌డంలో, పెట్టుబడుల ఆకర్షణ కేంద్రంగా నగరాన్ని తీర్చిదిద్ద‌డంలో ఆచరణాత్మక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒసాకా నగరంలో భారీ అగ్నిప్రమాదం - 27 మంది సజీవదహనం